Jio 5g Phone: మ‌రో సంచ‌ల‌నానికి తెర తీస్తోన్న జియో.. అత్యంత త‌క్కువ ధ‌ర‌లో 5జీ ఫోన్‌..

Jio 5g Phone: టెలికాలం రంగంలో పెను సంచ‌ల‌నంలా దూసుకొచ్చింది జియో. అంత్యంత త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మంది స‌బ్‌స్కైబ‌ర్ల‌ను సొంతం చేసుకొని ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌కు పోటీనిచ్చింది. ఈ క్ర‌మంలోనే చ‌వ‌కౌన 4జీ మొబైల్‌ను లాంచ్ చేసి యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకున్న జియో తాజాగా...

Jio 5g Phone: మ‌రో సంచ‌ల‌నానికి తెర తీస్తోన్న జియో.. అత్యంత త‌క్కువ ధ‌ర‌లో 5జీ ఫోన్‌..
Follow us

|

Updated on: Jan 27, 2022 | 2:10 PM

Jio 5g Phone: టెలికాలం రంగంలో పెను సంచ‌ల‌నంలా దూసుకొచ్చింది జియో. అంత్యంత త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మంది స‌బ్‌స్కైబ‌ర్ల‌ను సొంతం చేసుకొని ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌కు పోటీనిచ్చింది. ఈ క్ర‌మంలోనే చ‌వ‌కౌన 4జీ మొబైల్‌ను లాంచ్ చేసి యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకున్న జియో తాజాగా మ‌రో సంచ‌ల‌నానికి తెర తీసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. దేశంలో 5జీ నెట్‌వ‌ర్క్ విస్తృతి పెరుగుతున్న నేప‌థ్యంలో అత్యంత చ‌వ‌కౌన 5జీ మొబైల్ ఫోన్‌ను జియో త్వ‌ర‌లోనే లాంచ్ చేయ‌నుంది.

ఈ ఏడాదిలో జియో 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. 4 జీ మొబైల్‌ను ఎలాగైతే త‌క్కువ రేటుకు తీసుకొచ్చిందో 5జీ ఫోన్‌ను కూడా త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ సుమారు రూ. 10 వేల లోపు ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచ‌ర్ల‌కు సంబంధించి కొన్ని వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. వీటి ప్ర‌కారం ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించ‌నున్నట్లు స‌మాచారం. క్వాల్క‌మ్ స్నాప్‌డ్రాగ‌న్‌480 ప్రాసెస‌ర్‌తో న‌డిచే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో న‌డ‌వ‌నుంది. ఇక స్టోరేజ్ విష‌యానికొస్తే ఇందులో 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్న‌ల్ స్టోరేజ్‌తో రానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించ‌నున్నారు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేసే ఈ ఫోన్‌లో 5000 ఎమ్ఏహెచ్ బ్యాట‌రీని ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.

Also Read: Chanikya Niti: రేపుకి గ్యారెంటీ లేదు..మనిషి జీవితం సుఖ సంతోషాలతో తృప్తిగా సాగాలంటే ఈ ౩ పనులు చేయమంటున్న చాణక్య..

Tamil Nadu: రాష్ట్ర గీతాన్ని అవమానపరిచారంటూ ఆర్బిఐ సిబ్బందిపై తమిళ సంఘాలు మండిపాటు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన లాయర్

IND VS WI: ఈ ఐదుగురికి గోల్డెన్ ఛాన్స్.. వెస్టిండీస్‌తో సత్తా చాటితే ఇక తిరుగుండదన్న మాజీలు..!