Jio prima 2: జియో నుంచి మరో కొత్త ఫీచర్‌ ఫోన్‌.. యూపీఐ పేమెంట్స్ ఆప్షన్‌తో పాటు..

|

Sep 10, 2024 | 8:04 PM

ఇందులో భాగంగానే జియో తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. జియో ప్రైమా 2 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. గతేడాది లాంచ్‌ చేసిన జియో ప్రైమా మొబైల్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. పాత ఫోన్‌ను మరిన్ని మెరుగైన ఫీచర్లను జోడించింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Jio prima 2: జియో నుంచి మరో కొత్త ఫీచర్‌ ఫోన్‌.. యూపీఐ పేమెంట్స్ ఆప్షన్‌తో పాటు..
Jiophone Prima 2
Follow us on

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో.. యూజర్లను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తూనే ఉంది. ఓవైపు జియోతో టెలికాం యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త డేటా, కాలింగ్‌ ఆప్షన్స్‌తో రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొస్తుస్తూనే.. మరోవైపు ఫోన్‌ల తయారీ రంగంలోనూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే మార్కెట్లోకి పలు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చాయి. స్మార్ట్ ఫోన్‌లతో పాటు, ఫీచర్‌ ఫోన్‌లను తీసుకొస్తోంది.

ఇందులో భాగంగానే జియో తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. జియో ప్రైమా 2 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. గతేడాది లాంచ్‌ చేసిన జియో ప్రైమా మొబైల్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. పాత ఫోన్‌ను మరిన్ని మెరుగైన ఫీచర్లను జోడించింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

జియో ప్రైమా2 ఫోన్‌ను 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ రూ. 2799గా నిర్ణయించారు. బ్లూ కలర్‌లో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. చిన్న ఫీచర్‌ ఫోన్‌లో ఫ్రంట్‌ కెమెరాను అందించడం విశేషం. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ఫీచర్ల విషయానికొస్తే జియో ప్రైమా 2 ఫోన్‌లో 2.4 ఇంచెస్‌తో కూడిన కర్వడ్‌ స్క్రీన్‌ను అందించారు. కీ ప్యాడ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్‌ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు.

ఈ ఫోన్‌ సింగిల్‌ న్యానో సిమ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫోన్‌లో యూపీఐ పేమెంట్స్‌ చేసుకోవడం మరో విశేషం. జియో పే ద్వారా యూపీఐ పేమెంట్స్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ ఫోన్‌ 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 2000 ఎమ్‌ఏహెచ్‌ వంటి పవర్‌ ఫుల్ బ్యాటరీని అందించారు. అంతేకాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో సావన్‌ వంటి యాప్స్‌కు ఈ ఫోన్‌ సపోర్ట్ చేస్తుంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ కూడా యాక్సెస్‌ చేసుకోవచ్చు. 4జీ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే ఈ ఫోన్లో 3.5mm ఆడియో జాక్‌ను ఇచ్చారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..