
ఐటెల్ ఏ95 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. సరసమైన ధరకు లభించే ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ అంతర్నిర్మిత ఆస్క్ ఏఐ టూల్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతుంది . ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 తో నడుస్తుంది. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. ఐటెల్ ఏ-95 ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. 4 జీబీ, 6 జీబీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధరలు రూ.9,599 – రూ.9,999. మధ్య ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రంగులలో వస్తుంది. దేశంలోని అధీకృత రిటైల్, ఆన్‌లైన్ స్టోర్స్‌లో కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
ఐటెల్ ఏ-95 అనేది బడ్జెట్ స్నేహపూర్వక ధరలో అవసరమైన ఫీచర్లను కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించిన సరసమైన స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో పాటు ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ 6300 చిప్‌సెట్ ద్వాారా శక్తిని పొందుతుంది. ఐటెల్ ఏ-95 సెల్ఫీల కోసం 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పని చేస్తుంది.
ఈ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ 54 రేటింగ్ మద్దతుతో ఇస్తుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ దుమ్ము, స్ప్లాష్ ప్రూఫ్‌గా చేస్తుంది. ఐటెల్ ఏ-95 అంతర్నిర్మిత ఆస్క్ ఏఐతో వస్తుంది. ఇది గ్రామర్ చెక్, టెక్స్ట్ జనరేషన్, కంటెంట్ డిస్కవరీ వంటి ఫీచర్స్‌తో ఆకర్షిస్తుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి