My Map India: గూగుల్‌ ప్రత్యామ్నాయంగా రానున్న దేశీయ ‘మ్యాప్స్‘… ‘ఇస్రో‘ సహకారంతో..

|

Feb 13, 2021 | 4:28 PM

ISRO Launching My map India Rival To Google Maps: భారత్‌లో ప్రస్తుతం విదేశీ యాప్‌లకు ప్రత్నామ్నాయంగా దేశీ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ‘కూ‘ యాప్ ట్విట్టర్‌కు...

My Map India: గూగుల్‌ ప్రత్యామ్నాయంగా రానున్న దేశీయ ‘మ్యాప్స్‘... ‘ఇస్రో‘ సహకారంతో..
Follow us on

ISRO Launching My map India Rival To Google Maps: భారత్‌లో ప్రస్తుతం విదేశీ యాప్‌లకు ప్రత్నామ్నాయంగా దేశీ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ‘కూ‘ యాప్ ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయమని చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇక వాట్సాప్‌కు పోటీగా ‘సందేశ్‘ పేరుతో ఓ యాప్ వస్తోందని వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే తాజాగా మ్యాప్స్ సేవల్లో అగ్రస్థానంలో ఉన్న గూగుల్‌కు పోటీగా భారత్‌లో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగానే మ్యాప్స్ సేవలు అందించేందుకు భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో), మ్యాప్ మై ఇండియా చేతులు కలిపాయి. పూర్తి స్వదేశీ సాంకేతికతతో భారతీయులకు నావిగేషన్, మ్యాప్స్ అందించడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఈమేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ (డీవోఎస్‌), మ్యాప్‌ మై ఇండియా మాతృ సంస్థ సీఈ ఇన్ఫో సిస్టమ్స్‌తో ఒప్పందం కుదిరినట్టు ఇస్రో తెలిపింది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ఈ ఒప్పందం జరిగినట్టు మ్యాప్‌ మై ఇండియా సీఈవో రోహణ్‌ వర్మ చెప్పారు. ఈ సందర్భంగా రోహణ్ మాట్లాడుతూ.. స్వదేశీ నావిగేషన్ సేవల్లో ఈ ఒప్పందం ఓ మైలురాయి అని తెలిపారు. మ్యాప్ మై ఇండియా సంస్థ బాధ్యతాయుతమైన, దేశీ కంపెనీ. ఈ సంస్థ దేశసార్వభౌమత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాపులను రూపొందిస్తుందన్నారు. మ్యాప్ మై ఇండియా యూజర్లు ఇస్రో ఉపగ్రహాల సమాచారంతో మరింత స్పష్టంగా మ్యాపులను పొందొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న గూగుల్ మ్యాప్స్ గురించి రోహణ్ మాట్లాడుతూ.. గూగుల్ మ్యాప్స్ ఉచితమని చాలా మంది భావిస్తుంటారు. కానీ.. ఇతర కంపెనీలు మనకు ప్రకటనలు ఇవ్వడానికి గూగుల్ మన లొకేషన్‌ వివరాలను సేకరిస్తుంది. దీని ద్వారా సమాచార భద్రతపరంగా ప్రమాదకరమైన అంశమని తెలిపారు. తాము తీసుకొస్తున్న మ్యాప్ మై ఇండియాలో ఇలాంటి ఇబ్బందులు ఉండవని రోహణ్ చెప్పుకొచ్చారు.

Also Read: Apple-1: ఆపిల్ తొలి కంప్యూటర్ ఎంత ధరకు అమ్ముడు పోనుందో తెలుసా..? అక్షరాల రూ.11 కోట్లకుపైమాటే.. ఇంతకీ అంతలా ఏముందనేగా..