AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు మీ వాట్సాప్ చాట్‌లకు యాక్సెస్ పొందుతుందా? ప్రభుత్వం అనుమతిస్తుందా?

Income Tax: 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ఇప్పుడు ఆదాయపు పన్ను బిల్లు 2025 తీసుకువస్తోంది. ప్రస్తుత చట్టాలు పాత కాలం ప్రకారం రూపొందించి ఉన్నాయి. అవి నేటి డిజిటల్ టెక్నాలజీకి అనుగుణంగా లేవని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అందువల్ల పన్ను అధికారులకు డిజిటల్ యాక్సెస్ ఉండేలా దానిలో కొన్ని మార్పులు చేస్తున్నారు..

Income Tax: ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు మీ వాట్సాప్ చాట్‌లకు యాక్సెస్ పొందుతుందా? ప్రభుత్వం అనుమతిస్తుందా?
Subhash Goud
|

Updated on: Apr 02, 2025 | 6:40 PM

Share

ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు మీ వాట్సాప్ చాట్‌లకు యాక్సెస్ పొందుతుందని మీరు విన్నారా? ప్రతిపాదిత ఆదాయపు పన్ను బిల్లు 2025 పన్ను అధికారులు వాట్సాప్, ఇమెయిల్, సోషల్ మీడియా వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే పన్ను ఎగవేతను తనిఖీ చేయడానికి మీ ప్రైవేట్ చాట్‌లు, క్లౌడ్ స్టోరేజ్, ఎన్‌క్రిప్టెడ్ సందేశాలు కూడా పన్ను అధికారులచే స్కాన్ చేయబడతాయి. దీనిపై ప్రభుత్వం, పన్ను ఎగవేతను ఆపడానికి ఈ చర్య అవసరమని చెబుతోంది. అయితే ఇది ప్రైవసీ గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది.

కొత్త బిల్లు ఎందుకు తీసుకువస్తున్నారు?

1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ఇప్పుడు ఆదాయపు పన్ను బిల్లు 2025 తీసుకువస్తోంది. ప్రస్తుత చట్టాలు పాత కాలం ప్రకారం రూపొందించి ఉన్నాయి. అవి నేటి డిజిటల్ టెక్నాలజీకి అనుగుణంగా లేవని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అందువల్ల పన్ను అధికారులకు డిజిటల్ యాక్సెస్ ఉండేలా దానిలో కొన్ని మార్పులు చేస్తున్నారు.

ఏ మార్పులు సంభవించవచ్చు?

కొత్త బిల్లు ప్రకారం.. వర్చువల్ డిజిటల్ స్పేస్‌లో ఇమెయిల్ సర్వర్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్ పెట్టుబడి, ట్రేడింగ్ ఖాతాలు, క్లౌడ్ స్టోరేజ్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇమెయిల్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఉండవచ్చు. ఒక వ్యక్తి తన ఇమెయిల్, వాట్సాప్ వంటి డిజిటల్ ఖాతాలకు పన్ను అధికారులకు యాక్సెస్ ఇవ్వకపోతే, కొత్త బిల్లు ప్రకారం, అధికారులు భద్రతను దాటవేసి మీ డేటాను యాక్సెస్ చేయవచ్చు.

పన్ను అధికారుల నిఘా:

మీడియా నివేదికల ప్రకారం.. వాట్సాప్, ఇతర ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్‌లలో లభించిన సందేశాలు పన్ను ఎగవేత, లెక్కలోకి రాని సంపదను వెల్లడించాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. ఈ బిల్లులో అప్రకటిత ఆదాయం నిర్వచనాన్ని మరింత విస్తరించారు. ఇటువంటి నిబంధనలు కొత్తవి కాదని, ప్రస్తుతం 1961 ఐటీ చట్టంలోని సెక్షన్ 132 కింద అవి ఉన్నాయని సీతారామన్ హైలైట్ చేశారు. ఎవరైనా అలాంటి లావాదేవీల గురించి వాట్సాప్ లేదా మరేదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చర్చిస్తే, వారు కూడా పన్ను అధికారుల నిఘాలో ఉంటారు.

వాట్సాప్, టెలిగ్రామ్:

పన్ను అధికారులు డిజిటల్ డేటాను ఎప్పుడు, ఎలా యాక్సెస్ చేయవచ్చో బిల్లులో స్పష్టంగా ఉంది. కానీ వాట్సాప్, టెలిగ్రామ్ వంటి కంపెనీలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగిస్తాయి. దీని కారణంగా మూడవ వ్యక్తి మీ చాట్‌లను చదవలేరు. ప్రభుత్వం ఈ ఎన్‌క్రిప్షన్‌ను విచ్ఛిన్నం చేయాలని యోచిస్తుందా లేదా మొబైల్‌ డేటాను మాత్రమే ఉపయోగిస్తుందా? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి