Iphone: కరోనా మహమ్మారి మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. గతంలో ఎన్నడూ లేని కొత్త అలవాట్లను అలవాటు చేసింది. తీసుకునే ఆహారం నుంచి జీవన విధానం వరకు అన్ని రకాల అంశాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. గతంలో ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటేనో, ఆసుపత్రిలో పనిచేసే వారో మాస్కులు ధరించేవారు. కానీ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండాలంటే మాస్కు ధరించాల్సిన అవసరం వచ్చింది. దీంతో మనుషులంతా మాస్కులతోనే దర్శనమిస్తున్నారు. ఇలా తప్పనిసరిగా మారిన ఈ మాస్కులు ఎవరికి ఇబ్బందిగా మారిందో లేదో తెలియదు కానీ, స్మార్ట్ ఫోన్‌లో ఫేస్ ఐడీ ఫీచర్‌ను ఉపయోగించే వారికి మాత్రం ఇబ్బందిగా మారింది.
ఫోన్‌లో ఈ ఫీచర్ ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితి వచ్చింది. దీంతో తప్పనిసరిగా పాస్‌వర్డ్ లేదా ఫింగర్ ప్రింట్‌తో ఫోన్‌ను అన్‌లాక్ చేసుకుంటున్నారు. మరి మాస్కు ఉన్నా ఫేస్‌తో స్మార్ట్ ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోలేమా అంటే.. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే దిగ్గజ స్మార్ట్ ఫోన్ సంస్థ యాపిల్ రంగంలోకి దిగింది. ఐఓఎస్ 15.4లో మాస్క్ ఉన్నా ఫోన్ అన్‌లాక్ అయ్యే విధానాన్ని అందుబాటులోకి తీసుకుంది.
యూజర్ల విజ్ఞప్తి మేరకు యాపిల్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫేస్‌కు మాస్కు ఉన్నా సరే ఫోన్ అన్‌లాక్ అవుతుంది. అయితే ఇందుకోసం ముందుగా మాస్కుతో కూడిన ముఖం ఫోటోను అందించాల్సి ఉంటుందా.? లేదా ఏ విధంగా ఫోన్ గుర్తుపడుతుందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఐఫోన్ ఎక్స్ ఆ తర్వాతి మోడల్స్‌లోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ కరోనా మహమ్మారి ఇంకెన్ని వింతలకు కారణమవుతుందో కదూ..!
Also Read: 29 ఫోర్లు, 7 సిక్సులు.. బౌలర్లను ఉతికారేసిన ఓపెనర్లు.. ఇదేం బ్యాటింగ్ రా బాబోయ్ అంటోన్న నెటిజన్లు