
బెస్ట్ సెల్లింగ్ ఫోన్ అనగానే.. చాలా మంది మిడ్ రేంజ్ ప్రైజ్ ఉన్న ఫోన్ అని అనుకొని ఉంటారు. కానీ 2025లో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్ ఏదో తెలుసా యాపిల్ ఐఫోన్ 16. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నుండి ఇటీవలి నివేదిక ప్రకారం ఐఫోన్ 16 2025లో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. యాపిల్, శామ్‌సంగ్ కలిసి ప్రపంచవ్యాప్తంగా మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో 19 శాతం వాటా కలిగి ఉన్నాయి. మొత్తం మార్కెట్లో ఈ రెండు కంపెనీలు అత్యధిక వాటా కలిగి ఉండటం ఇది వరుసగా నాలుగో ఏడాది. ఇక ఫోన్ మోడల్స్ విషయానికి వస్తే.. మొత్తం 10 టాప్ సెల్లింగ్ ఫోన్స్‌లో యాపిల్ పది స్థానాల్లో ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. ఐఫోన్ 16 అగ్రస్థానంలో ఉంది. శామ్‌సంగ్ మిగిలిన మూడు స్థానాలను భర్తీ చేసింది.
విచిత్రమేమిటంటే యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను సెప్టెంబర్ 2025లో లాంచ్ చేసింది. ఆ ఫోన్‌లు కూడా బాగానే అమ్ముడైంది. కానీ ఐఫోన్ 16 ను మాత్రం దాటలేకపోయింది. ఇప్పటికీ ఐఫోన్ 16 టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. దీని ధర ఇండియాలో రూ.69,900 నుండి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 17 రిలీజ్ అయిన మొదటి 3 నెలల్లో ఐఫోన్ 16 కంటే 16 శాతం ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. కానీ ఆ తర్వాత ఐఫోన్ 16 తన క్రేజ్‌ను నిలబెట్టుకుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి