భారత్‌లో తయారవుతోన్న ఐఫోన్ 12.. నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌

| Edited By:

Aug 22, 2020 | 7:43 PM

యాపిల్ సంస్థ‌ భారత్‌లో ఐఫోన్-12 స్మార్ట్‌ఫోన్లను తయారు చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఉత్పత్తి

భారత్‌లో తయారవుతోన్న ఐఫోన్ 12.. నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌
Follow us on

iPhone 12 made in India: యాపిల్ సంస్థ‌ భారత్‌లో ఐఫోన్-12 స్మార్ట్‌ఫోన్లను తయారు చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఉత్పత్తి ప్రక్రియను తైవాన్‌కి చెందిన విస్ట్రాన్ కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. కర్ణాటకలోని కోలార్ జిల్లా నరసాపురలో గల ఫ్లాంట్‌లో ఐఫోన్ 12 కాంపోనెట్స్ ఉత్పత్తి మొదలైంది. ఈ నేపథ్యంలో విస్ట్రాన్‌ కంపెనీ దశల వారీగా దాదాపు 10వేల మందికి ఉద్యోగాలు కల్పించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇక ఇప్పటికే 2వేల మంది స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇందుకు సంబంధించి డిప్లొమా చదివిన వారికి వాక్-ఇన్‌‌ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని, అనుభవజ్ఞులతో పాటు ఫ్రెషర్లకు కూడా త్వరలోనే మరిన్ని అవకాశాలు ఇవ్వబోతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇక అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటిని మేడిన్ ఇండియా ఐఫోన్ 12 అందుబాటులోకి రానుంది.

కాగా ప్రస్తుతం ఐఫోన్ 12కు సంబంధించి కాంపొనెట్స్ ట్రయల్ ప్రొడక్షన్ జరుగుతుండగా.. సెప్టెంబర్ నుంచి కమర్షియల్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఇక ఐఫోన్‌ని స్థానికంగా ఉత్పత్తి చేయడం వలన 22 శాతం మేర దిగుమతి పన్నులు తగ్గడంతో పాటుగా స్థానికులకు కొత్త ఉద్యోగవకాశాలు లభించనున్నాయి. ఇక విస్ట్రాన్‌ ప్రత్యర్థి కంపెనీ ఫాక్స్‌కాన్‌ తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్ 11ను చెన్నైలోని ఫ్లాంట్‌లో తయారు చేస్తోన్న విషయం తెలిసిందే.

Read More:

రమణదీక్షితులు మరో సంచలన ట్వీట్‌

హెచ్‌1బీ వీసా కుంభకోణం: అమెరికాలో భారతీయుడి అరెస్ట్‌