Train Coach Washing Plant: రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభ్రత ఎంతో అవసరం. ట్రైన్ ఎలా ఉన్నా.. అందులో పరిశుభ్రత అనేది ఎంతో ముఖ్యం. ఏ ట్రైన్ చూసినా.. అపరిశుభ్రంగా ఉండటం కనిపిస్తుంటుంది. రైళ్లు ప్రతి రోజు వేలాది కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి. అటువంటి పరిస్థితుల్లో రైళ్లల్లో దుమ్ము, ధూళి ఉండటం సహజం. దుమ్ము, ధూళితో నిండిపోవడంతో రైళ్లన్నీ అపరిశుభ్రంగా కనిపిస్తుంటాయి. దీంతో రైళ్లను శుభ్రం చేయాలంటే సమయం ఎక్కువ పడుతుంది. దీంతో తక్కువ సమయంలోనే రైల్వే కోచ్‌లను శుభ్రం చేసేందుకు బెంగళూరు రైల్వే స్టేషన్‌లో ఆటోమేటిక్ వాషింగ్ స్టిస్టమ్‌ను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
ఈ కోచ్‌లను శుభ్రం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ వల్ల నీరు ఆదా అవుతుంది. తక్కువ సమయాల్లోనే రైలు శుభ్రంగా మారిపోతుంది. శుభ్రం చేసేందుకు పని మనుషుల బాధ తప్పుతుంది. కోచ్‌లను శుభ్రం చేసిన నీటితోనే 80 శాతం వరకు మళ్లీ రీసైక్లింగ్ చేసి వాటినే ఉపయోగిస్తున్నారు. కోచ్‌లోని లోపలి భాగాన్ని శుభ్రం చేయాలంటే దాదాపు 2వేల లీటర్ల నీరు వృధా అవుతుంది. కోచ్ వాషింగ్ ప్లాంట్ ద్వారా నీరు మరింతగా ఆదా చేయవచ్చు అంటున్నారు రైల్వే అధికారులు.
బీహార్‌లోని సమస్తిపూర్ రైల్వే డివిజన్‌లోని సహర్సా స్టేషన్‌లో ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ద్వారా రైలు బయటి భాగాన్ని కేవలం ఐదు నిమిషాల్లోనే శుభ్రం అవుతుంది. అధికారుల సమచారం ప్రకారం.. రైల్వే ఈ ప్రాజెక్టులో సుమారు రూ.1.60 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఇన్‌ఛార్జ్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. సహర్సాలో కోచ్ వాషింగ్ ప్లాంట్‌లో ట్రాక్‌లోని 40 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ప్లాంట్‌ను రూ. కోటి 60 లక్షలతో నిర్మించామని, ఇక 5 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవుతో నీటి ట్యాంకును కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు కోచ్‌లన్నీ తక్కువ సమయంలో, తక్కువ నీటితో శుభ్రం చేయవచ్చు. కోచ్ వాషింగ్ ప్లాంట్‌పై ఐదు కిలోమీటర్ల వేగంతో రైళ్లు వెళ్తాయి. ఒక రైలు కోచ్ పొడవు 23 మీటర్లు. రైలుకు 24 కోచ్‌లను శుభ్రం చేయాలంటే కేవలం 6 నుంచి 7 నిమిషాల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
Automatic Coach Washing plant at KSR Bengaluru station not only minimizes time & water for cleaning, but also facilitates efficient use of manpower,ensures effective exterior cleaning of coaches. pic.twitter.com/zBTJVxvANx
— Ministry of Railways (@RailMinIndia) September 12, 2021