కదిలే ట్రైన్‌లో షాపింగ్ చేసేయొచ్చు..!
షాపింగ్.. పలు మార్కెట్స్‌లలో లేదా పలు షాపింగ్ మాల్స్‌లలో చేస్తూంటాం. సరదాగా.. బస్టాండ్‌లలో లేక ఎయిర్‌పోర్టుల్లో కూడా షాపింగ్ చేస్తూంటాం. కానీ.. ట్రైన్‌లో ఎప్పుడైనా షాపింగ్ చేశారా..? ఏంటి..! కదిలే ట్రైన్ షాపింగ్.. ఎలా సాధ్యం అనుకుంటున్నారా..? ఇక నుండి కదిలే ట్రైన్‌లోనే షాపింగ్ చేయవచ్చంట. రైల్వే ప్రయాణికులకు ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. ఇండియన్ రైల్వేస్ ట్రైన్ ప్యాసింజర్ల కోసం ఆన్‌బోర్డ్ షాపింగ్ సర్వీసులను లాంచ్ చేసింది. ఈ సర్వీసులు ప్రస్తుతం అహ్మదాబాద్-ముంబై కర్నావతి ఎక్స్‌ప్రెస్‌లో […]

షాపింగ్.. పలు మార్కెట్స్‌లలో లేదా పలు షాపింగ్ మాల్స్‌లలో చేస్తూంటాం. సరదాగా.. బస్టాండ్‌లలో లేక ఎయిర్‌పోర్టుల్లో కూడా షాపింగ్ చేస్తూంటాం. కానీ.. ట్రైన్‌లో ఎప్పుడైనా షాపింగ్ చేశారా..? ఏంటి..! కదిలే ట్రైన్ షాపింగ్.. ఎలా సాధ్యం అనుకుంటున్నారా..? ఇక నుండి కదిలే ట్రైన్‌లోనే షాపింగ్ చేయవచ్చంట. రైల్వే ప్రయాణికులకు ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. ఇండియన్ రైల్వేస్ ట్రైన్ ప్యాసింజర్ల కోసం ఆన్‌బోర్డ్ షాపింగ్ సర్వీసులను లాంచ్ చేసింది. ఈ సర్వీసులు ప్రస్తుతం అహ్మదాబాద్-ముంబై కర్నావతి ఎక్స్‌ప్రెస్‌లో అందుబాటులోకి వచ్చాయి. కాగా.. త్వరలోనే ఇక అన్ని రైళ్లల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ట్వీట్ చేసింది.
కాస్మటిక్స్, స్టేషనరీ, ఫుడ్ ఐటమ్స్, స్కిన్ కేర్, పేపర్ ప్రాడెక్ట్స్ ఇలా అన్ని రకాల వస్తువులను ట్రైన్‌లో కొనుగోలు చేయవచ్చని.. వీటిని పలు డిజిటల్, ఆన్‌లైన్ లేదా క్యాష్ రూపంలో చెల్లింపులు చెల్లించవచ్చని ఇండియన్ రైల్వేస్ సంస్థ తెలిపింది.
Ahmedabad Division of Western Railway has started On Board shopping in 12934 Ahmedabad Jn-Mumbai Central Karnavati Express from today. pic.twitter.com/vqlfeU1zcM
— Ministry of Railways (@RailMinIndia) August 8, 2019