WhatsApp Tips: మీ వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? నో టెన్షన్.. జస్ట్ ఈ సింపుల్ ట్రిక్‌తో మళ్లీ పొందొచ్చు..

సురక్షితంగా ఉపయోగించేందుకు యూజర్ల భద్రత కోసం వాట్సప్ అనేక నియమాలను తెస్తోంది. నిషేధిత కార్యకలాపాలకు పాాల్పడిన వారి వాట్సప్ అకౌంట్‌ను బ్యాన్ చేస్తూ ఉంది. వాట్సప్ నిబంధనలు పాటించకపోతే మీ నెంబర్‌పై వాట్సప్ అకౌంట్‌ను బ్యాన్ చేయవచ్చు. ఇలాంటి సమయంలో మనం తిరిగి ఎలా పొందాలంటే..

WhatsApp Tips: మీ వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? నో టెన్షన్.. జస్ట్ ఈ సింపుల్ ట్రిక్‌తో మళ్లీ పొందొచ్చు..
Whatsapp Alert

Updated on: Dec 20, 2025 | 2:42 PM

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరూ వాట్సప్ అనేది తప్పనిసరిగా వాడుతున్నారు. వాట్సప్ లేని స్మార్ట్‌ఫోన్ అంటూ ఏదీ ఉండటం లేదు. వ్యక్తిగత వ్యవహారాలు లేదా జాబ్, వ్యాపార అవసరాల కోసం వాట్సప్ అనేది తప్పనిసరిగా ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడింది. సింపుల్‌గా మెస్సేజ్, ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ అందుకోవడానికి లేదా ఇతరులకు పంపడానికి ఈ సోషల్ మెస్సేజింగ్ ఫ్లాట్‌ఫామ్ బాగా ఉపయోగపడుతుంది. ఇక కస్టమర్లకు రీచ్ అవ్వడానికి వ్యాపార అవసరాల కోసం బిజినెస్ అకౌంట్ ఉపయోగకరంగా ఉంటుంది. యూజర్ల భద్రత, పారదర్శకత కోసం వాట్సప్ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. అందులో వాట్సప్ అకౌంట్ బ్యాన్ ఒకటి.

మీ అకౌంట్ బ్యాన్ అయిందా..?

స్పామ్, బల్క్, మీ ఫోన్‌లో సేవ్‌లో లేని తెలియని నెంబర్లకు ఎక్కువగా మెస్సేజ్‌లు పంపడం, మిస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఎక్కువమంది మీ నెంబర్‌ను బ్లాక్ చేయడం లేదా రిపోర్ట్ చేయడం, వాట్సప్ నకిలీ వెర్షన్లు వాడటం వల్ల మీ నెంబర్‌పై వాట్సప్ అకౌంట్‌ను బ్యాన్ చేస్తూ ఉంటుంది. బ్యాన్ విధించడం వల్ల మీ నెంబర్‌పై మీరు వాట్సప్‌ను ఉపయోగించలేరు. మీరు వాట్సప్ ఓపెన్ చేస్తే మీరు ఎక్కువకాలం వాట్సప్‌ను వాడలేరు అనే మెస్సేజ్ కనిపిస్తూ ఉంటుంది.

అకౌంట్ బ్యాన్ అయినప్పుడు ఏం చేయాలి..?

మీ అకౌంట్ బ్యాన్ అయినప్పుడు మీరు మీ నెంబర్‌తో వాట్సప్ ఓపెన్ చేయగానే.. రిక్వెస్ట్ ఏ రివ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి అకౌంట్‌ను తప్పుగా బ్యాన్ చేశారనే మెస్సేజ్ రాసి సబ్మిట్ చేయాలి. దీంతో మీ మెస్సేజ్‌ను 24 గంటల్లోగా పరిశీలించాక వాట్సప్ మీ నెంబర్‌ను బ్యాన్ నుంచి తొలగిస్తుంది. దీంతో మీరు యధావిధిగా వాట్సప్ ఉపయోగించుకోవచ్చు.

మెయిల్ ద్వారా..

ఇక మెయిల్ ద్వారా కూడా వాట్సప్‌కు మీ సమస్యను చెప్పవచ్చు. support@whatsapp.com అనే మెయిల్ ఐడీకి మీ సమస్యను మెయిల్ చేయండి. తన అకౌంట్ తప్పుగా బ్లాక్ చేశారనే మెస్సేజ్‌ను మెయిల్‌లో రాసి పంపంచండి. దీంతో వాట్సప్ సిబ్బంది పరిశీలించి మీ నెంబర్‌ను బ్యాన్ నుంచి తొలగిస్తారు. ఒకవేళ మీరు వాట్సప్ నిబంధనలను పాటించకపోతే పర్మినెంట్‌గా మీ నెంబర్‌పై వాట్సప్  పనిచేయకుండా నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయి. అందుకే వాట్సప్ నియమ, నిబంధనలను వాటిస్తూ ఉండాలి.