VI Recharge Plan: రూ.401తో రీచార్జ్ చేస్తే చాలు.. తెల్లార్లు, ఫ్రీ డేటాతో ఓటీటీ సినిమాలతో పండగ చేసుకోండి..

మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ప్రాంతీయ ఓటీటీ కంటెంట్ ను ఆస్వాధించాలంటే యూజర్ల కోసం వొడాఫోన్ ఐడియా స్పెషల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ప్రకటించింది.

VI Recharge Plan: రూ.401తో రీచార్జ్ చేస్తే చాలు.. తెల్లార్లు, ఫ్రీ డేటాతో ఓటీటీ సినిమాలతో పండగ చేసుకోండి..
Recharge Plan

Edited By: Janardhan Veluru

Updated on: Mar 05, 2023 | 8:48 PM

మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ప్రాంతీయ ఓటీటీ కంటెంట్ ను ఆస్వాధించాలంటే యూజర్ల కోసం వొడాఫోన్ ఐడియా స్పెషల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ప్రకటించింది. రూ. 401 ధరతో, రీఛార్జ్ ప్లాన్ ‘Vi Max 401 సౌత్’ పేరుతో అందుబాటులో ఉంది. అన్ లిమిటెడ్ డేటాతో పాటు కాలింగ్ బెనిఫిట్స్ Sun NXT ప్రీమియం HD OTT సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది. వొడాఫోన్ పోస్టుపెయిడ్ యూజర్లు తమకు నచ్చిన భాషలో అత్యంత సమగ్రమైన చిత్రాలు, టీవీ షోలు, మ్యూజిక్ వీడియోలకు యాక్సిస్ అందిస్తుంది.

రూ. 401 వోడాఫోన్-ఐడియా ప్లాన్ వివరాలు:

ఈ ప్లాన్ ఆన్ లైన్ కొనుగోలు కోసం మాత్రమే అందుబాటులో ఉంది. అదనపు 50జీబీతో 1 పోస్టుపేయిడ్ కనెక్షన్ను అందిస్తుంది. యూజర్లు రాత్రి సమయంలో అన్ లిమిటెడ్ డేటాతో ఉదయం 12గంటల నుంచి ఉదయం 6గంటల వరకు అపరిమిత డేటాను అందిస్తుంది. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 200జీబీ డేటా రోల్‌ఓవర్ సౌకర్యం కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో, ప్రతి నెల వినియోగదారులకు 3000 SMSలు నెలవారీగా పొందవచ్చు. రూ. 799 విలువైన సన్ నెక్ట్స్ 12 నెలల ఫ్రీ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ , వీఐ మూవీస్, టీవీ యాప్ విప్ యాక్సెస్ , జీ 5 ప్రీమియమ్ కు ఫ్రీ యాక్సెస్, హంగామా మ్యూజిక్, వీఐ యాప్ వంటి మరిన్ని కూడా ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేయడం ద్వారా ఈ ప్లాన్‌లో 50 జీబీ అదనపు డేటా కూడా అందుబాటులో ఉంటుంది. ఇదే విభాగంలో వొడాఫోన్ ఐడియా మరో రూ. 401 ప్లాన్, మీరు ఒక సంవత్సరం పాటు Sony Liv యాప్‌కి యాక్సెస్ పొందుతారు. ఈ ప్లాన్‌లో అన్ని ఇతర ప్రయోజనాలు అలాగే ఉంటాయి. వోడాఫోన్-ఐడియా రూ. 401 ప్లాన్ తో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ రూ. 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో పోటీ పడుతుంది.

ఇవి కూడా చదవండి

రూ. 399 ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్:

ఎయిర్‌టెల్ రూ. 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 40జిబి డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ అపరిమిత కాలింగ్, 100 SMSలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ Airtel Xstream అప్లికేషన్‌కు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్‌లో OTT ప్లాట్‌ఫారమ్ యాక్సెస్ అందుబాటులో లేదు.

రిలయన్స్ జియో రూ. 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్:

రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ రూ. 399 ప్లాన్, కస్టమర్లకు 75 జిబి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 200జిబి డేటా రోల్‌ఓవర్ సౌకర్యంతో వస్తుంది. ఇది కాకుండా, ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లకు ఉచిత సభ్యత్వం కూడా ప్లాన్‌లో అందుబాటులో ఉంది. ఇది కాకుండా, వినియోగదారులు JioTV, JioSecurity, JioCloudకి ఉచిత యాక్సెస్‎ను పొందుతారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..