Amazon Sale: స్మార్ట్‌ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. అమెజాన్‌ సేల్‌లో ఊహకందని డిస్కౌంట్స్‌

ఇక ఈ సేల్‌లో భాగంగా ఏయే ప్రొడక్ట్స్‌పై ఎంత డిస్కౌంట్స్‌ ఇవ్వనున్న విషయాన్ని తెలుపుతూ అమెజాన్‌ కొన్ని వివరాలను తెలియ చేస్తోంది. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్స్‌, ఆడియో డివైజ్‌లు, స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌పై ఆఫర్లను ప్రకటిస్తూ వచ్చిన అమెజాన్‌ తాజాగా స్మార్ట్ ఫోన్‌లపై డిస్కౌంట్స్‌ను ప్రకటించాయి. అక్టోబర్ 8వ తేదీ నుంచి అమెజాన్‌ సేల్ ప్రారంభమవుతోన్న నేపథ్యంలో..

Amazon Sale: స్మార్ట్‌ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. అమెజాన్‌ సేల్‌లో ఊహకందని డిస్కౌంట్స్‌
Amazon Sale 2023

Updated on: Sep 30, 2023 | 2:24 PM

Amazon Great Indian Festival: పండుగ సీజన్‌ను క్యాష్‌ చేసుకునే క్రమంలో ఈ కామర్స్‌ సంస్థలు భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్‌ సైట్స్‌ అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే సేల్స్‌ను ప్రకటించాయి. ఇందులో భాగంగానే అమెజాన్‌.. గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌ పేరుతో సేల్‌ను నిర్వహిస్తోంది. అక్టోబర్‌ 7వ తేదీ అర్థ రాత్రి నుంచి గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్ ప్రారంభం కానుంది. అయితే ప్రారంభ తేదీన ప్రకటించిన అమెజాన్‌.. చివరి తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

ఇక ఈ సేల్‌లో భాగంగా ఏయే ప్రొడక్ట్స్‌పై ఎంత డిస్కౌంట్స్‌ ఇవ్వనున్న విషయాన్ని తెలుపుతూ అమెజాన్‌ కొన్ని వివరాలను తెలియ చేస్తోంది. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్స్‌, ఆడియో డివైజ్‌లు, స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌పై ఆఫర్లను ప్రకటిస్తూ వచ్చిన అమెజాన్‌ తాజాగా స్మార్ట్ ఫోన్‌లపై డిస్కౌంట్స్‌ను ప్రకటించాయి. అక్టోబర్ 8వ తేదీ నుంచి అమెజాన్‌ సేల్ ప్రారంభమవుతోన్న నేపథ్యంలో.. ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్న వారికి ఒక రోజు నుంచి ముందు నుందే సేల్ అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీలపై మునుపెన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా సామ్‌సంగ్‌, వన్‌ప్లస్, సోనీ, ఎల్‌జీ, షావోమీ బ్రాండ్ర్‌కు చెందిన స్మార్ట్ టీవీలపై ఏకంగా 60 శాతం వరకు డిస్కౌంట్‌ను అందింనున్నారు. ఇక ఈ సేల్‌లో డిస్కౌంట్స్‌ లభిస్తోన్న కొన్ని స్మార్ట్ టీవీలపై ఓ లుక్కేయండి..

* చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ.. 43 ఇంచెస్‌ 4కే అల్ట్రా హెచ్‌డీ టీవీ అసలు ధర ఊ. 42,999గా ఉండగా, అన్ని ఆఫర్స్‌ కలుపుకొని రూ. 20,499కే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది.

* ఇక వన్‌ప్లస్‌ బ్రాండ్‌కి చెందిన 34 వై1 ఎస్ ప్రో టీవీ అసలు ధర రూ. 39,999గా ఉండగా అన్ని ఆఫర్స్‌ కలుపుకొని రూ. 20,499కే సొంతం చేసుకునే అవకాశం ఉంది.

* ఎల్జీ 50 ఇంచెస్‌ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 60,99కాగా డిస్కౌంట్స్‌లో భాగంగా రూ. 40,990కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు.

* ఇక వీయూ టీవీపై కూడా భారీ డిస్కౌంట్స్‌ లభిస్తోది. వీయూ 55 ఇంచెస్‌ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 80 వేలు కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 62,999గా ఉంది.

* సామ్‌సంగ్‌ క్రిస్టల్‌ 4కే ఐ స్మార్ట్ యూహెచ్‌డీ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 52,900గా ఉండగా.. డిస్కౌంట్‌లో భాగంగా రూ. 32,990కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు.

* ఇక ఎసెర్‌ కంపెనీకి చెందిన 50 ఇంచెస్‌ వీ సిరీస్ 4కే అల్ట్రా హెచ్‌డీ క్యూ ఎల్‌ఈడీ టీవీ ధర రూ. 59,999గా ఉండా డిస్కౌంట్‌ పోనూ రూ. 32,499కే సొంతం చేసుకోవచ్చు.

ఈ ఆఫర్స్‌తో పాటు అన్ని టీవీలపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్స్‌ సైతం అందిస్తున్నారు. ఇక అమెజాన్‌ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌తో పాటు వెల్‌ కం రివార్డు పాయింట్లు సైతం పొందొచ్చు. ఇక అమెజాన్‌ సేల్‌లో భాగంగా ఏదైనా ప్రొడక్ట్‌ను ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ పొందేలా అవకాశం కల్పించారు. దీంతో టీవీల ధరలు మరింత తగ్గనున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..