Smart phone: మీ ఫోన్‌లో వైరస్‌ ఉందని డౌట్‌గా ఉందా.? ఇలా చెక్‌ చేసుకోండి

స్మార్ట్‌ ఫోన్‌ కేంద్రంగా ఎన్నో రకాల మోసాలు జరుగుతున్నాయి. సైబర్ నేరస్థులు స్మార్ట్ ఫోన్స్‌ను ఆసరగా చేసుకొని మన బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. సైలెంట్‌గా స్మార్ట్‌ ఫోన్‌లోకి వైరస్‌ను జొప్పించి హ్యాక్‌ చేస్తున్నారు. అయితే మనం ఉపయోగిస్తున్న ఫోన్‌లో ఇలాంటి మార్పులు గమనిస్తే, అది హ్యాక్‌కి గురైనట్లు అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Smart phone: మీ ఫోన్‌లో వైరస్‌ ఉందని డౌట్‌గా ఉందా.? ఇలా చెక్‌ చేసుకోండి
Smart Phone Virus
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 03, 2024 | 5:38 PM

స్మార్ట్‌ఫోన్‌తో అన్ని పనులు సులువుగా మారిపోయాయి. ఫ్లైట్ టికెట్‌ బుకింగ్‌ మొదలు, కరెంట్‌ బిల్లు వరకు అన్ని పనులు ఫోన్‌తోనే చేసే రోజులు వచ్చేశాయ్‌. అయితే స్మార్ట్‌ ఫోన్‌తో ఉపయోగాలు ఉన్నట్లు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది వైరస్‌. స్మార్ట్‌ ఫోన్‌లోకి వైరస్‌ ఎంటర్‌ అవుతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు రకాల ఏపీకే ఫైల్స్‌ ద్వారా ఫోన్‌లోకి వైరస్‌ను జొప్పించి, కేటుగాళ్లు మన వ్యక్తిగత డేటాను కొట్టేస్తున్నారు. అయితే మన ఫోన్‌లో ఏదైనా వైరస్‌ ఎంటర్‌ అయ్యిందా.? అనే విషయాన్ని ఫోన్‌లో జరిగే కొన్ని మార్పుల ఆధారంగా తెలుసుకోవచ్చు.

సాధారణంగా ఫోన్‌ హ్యాక్‌ అయినా ఏదైనా వైరస్‌ ఉన్నా ఫోన్‌ వేగం తగ్గుతుంది. ఉన్నపలంగా ఫోన్‌ వేగం తగ్గితే అది వైరస్‌ సంకేతంగా భావించాలని నిపుణులు అంటున్నారు. ఇక పాపప్‌ ప్రకటనలు అదే పనిగా వస్తున్న వెంటనే అలర్ట్‌ అవ్వాలి. మీరు ఎలాంటి నోటిఫికేషన్స్‌ను యాక్టివేట్ చేసుకోకపోయినా అదే పనిగా పాపప్స్‌ వస్తుంటే ఫోన్‌లోకి వైరస్‌ వచ్చిందని భావించాలి.

ఇక మీరు ఇంటర్నెట్‌ ఉపయోగించిక పోయినా మొబైల్ డేటా వేగంగా ఖర్చువుతంటే కూడా ఫోన్‌ హ్యాక్‌ లేదా ఫోన్‌లోకి వైరస్‌ జొప్పించారని భావించాలి. ఫోన్‌ హ్యాక్‌ అయిన సమయంలో మనకు తెలియకుండా బ్యాగ్రౌండ్‌లో అప్లికేషన్స్‌ రన్‌ అవుతాయి. డేటా త్వరగా ఖర్చవుతుండడానికి ఇదే కారణం. అలాగే ఫోన్‌ను ఉపయోగించకపోయినా బ్యాటరీ త్వరగా డిచ్ఛార్జ్‌ అవుతున్నా ఫోన్‌లో ఏదో తేడా జరుగుతోందని అర్థం చేసుకోవాలి. మీ అనుమతి లేకుండా మీ ఫోన్‌లో తెలియన్‌ యాప్స్‌ ఏవైనా కనిపిస్తే మీ ఫోన్‌ హ్యాక్‌ అయినట్లుగా భావించాలి. కచ్చితంగా మీ ఫోన్‌లో వైరస్‌ ఉందని చెప్పేందుకు ఇది కూడా ఒక లక్షణంగా చెప్పొచ్చు.

ఫోన్‌లలో ఈ సమస్య రాకుండా ఉండాలంటే మంచి యాంటీవైరస్‌ను ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా మీరు ఎక్కువగా బ్రౌజింగ్ చేస్తున్నా. ఎక్కువల ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ చేస్తున్నా ఇలాంటి యాంటీ వైరస్‌లను ఉపయోగించాలి. ఫోన్‌లో ఏవైనా అనుమానంగా ఉన్న యాప్స్‌ ఉంటే వెంటనే వాటిని తొలగించాలి. ఫోన్‌లో సేఫ్‌ మోడ్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఫోన్‌లో వైరస్‌ ఉన్నట్లు అనుమానం వస్తే.. ఫోన్‌ డేటాను బ్యాకప్‌ చేసుకొని ఫ్యాక్టరీ రీసెట్‌ చేయడం ఉత్తమం. ఇలా చేస్తే ఫోన్‌ మళ్లీ కొత్తదానిలా మారుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..