ఫోన్‌లో ఛార్జింగ్‌ తర్వగా డౌన్‌ అయిపోతుందా? అయితే ఈ సెట్టింగ్స్‌ మార్చండి బ్యాటరీ లైఫ్‌ పెరుగుతుంది!

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేకుండా ఉండలేం. బ్యాటరీ పెద్దదైనా ఛార్జింగ్ నిలవడం లేదు. మీ ఫోన్ ఛార్జింగ్ ఎక్కువ సమయం ఉండేందుకు కొన్ని సులభమైన చిట్కాలు పాటించండి. డిస్‌ప్లే ఆల్వేస్ ఆన్‌లో ఉంచకుండా, అడాప్టివ్ బ్యాటరీ, బ్యాటరీ సేవర్ మోడ్‌లను ఆన్ చేయడం ద్వారా బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవచ్చు.

ఫోన్‌లో ఛార్జింగ్‌ తర్వగా డౌన్‌ అయిపోతుందా? అయితే ఈ సెట్టింగ్స్‌ మార్చండి బ్యాటరీ లైఫ్‌ పెరుగుతుంది!
Smartphone Battery Life

Updated on: Dec 20, 2025 | 4:15 PM

స్మార్ట్‌ఫోన్ లేని వాళ్లు చూద్దామన్న కనిపించే పరిస్థితి లేదు. ఫోన్‌ చూడకుండా ఓ పది నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాం. ప్రతి అవసరానికి ఫోన్‌ అలవాటు అయిపోయింది. గతంలో పోలిస్తే పెద్ద పెద్ద బ్యాటరీలతో ఫోన్లు వస్తున్నాయి. కానీ, మనం వాడే వాడకానికి ఎంత పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా ఎక్కువ గంటలు రావడం లేదు. అందుకే మనం చేసే కొన్ని తప్పులు కారణం అవుతున్నాయి. అయితే కొన్ని టిప్ప్‌ పాటిస్తే మీ ఫోన్‌ ఛార్జింగ్‌ ఎక్కువ గంటలు రావొచ్చు. మరి ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డిస్‌ప్లే ఎప్పుడూ ఆన్‌లో ఉంచొద్దు. అది ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటే బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. మీ ఫోన్ సెట్టింగ్‌లోకి వెళ్లి.. డిస్‌ప్లే సెట్టింగ్‌లోకి వెళ్లాలి. ఆ తరువాత లాక్ స్క్రీన్ ఆప్షన్‌ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు అక్కడ ఆల్వేస్ షో ఇన్‌ఫో ఆప్షన్ గానీ, ఎనబుల్ ఆల్వేస్ డిస్‌ప్లే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేయాలి.

ఆండ్రాయిడ్ ఫోన్లలో అడాప్టివ్ బ్యాటరీ అనే ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగడంతో పాటు.. ఫోన్ పనితీరు కూడా మెరుగవుతుంది. ఈ ఆప్షన్ కోసం మీరు సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. బ్యాటరీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత అడాప్టివ్ బ్యాటరీ ప్రిఫరెన్స్‌లకు వెళ్లాలి. అడాప్టివ్ బ్యాటరీ ఎనబుల్ చేయండి. అడాప్టివ్ బ్యాటరీతో పాటు, బ్యాటరీ సేవర్ మోడ్ కూడా మీ ఫోన్‌లో ఛార్జింగ్ ఎక్కువ సమయం ఉండేందుకు దోహదపడుతుంది. ఈ ఫీచర్ మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌లో విజువల్ ఎఫెక్ట్స్‌లను పరిమితం చేయడం, పలు యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో ఛార్జింగ్ ఉపయోగించకుండా ఆపుతుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి