Whatsapp: మీకు నచ్చిన ఫొటోను స్టిక్కర్‌గా మార్చుకోవచ్చని తెలుసా.? ఈ వాట్సాప్ ఫీచర్‌పై ఓ లుక్కేయండి..
Whatsapp: ప్రస్తుతం టాకింగ్ కంటే ఎక్కువగా చాటింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ చాటింగ్ కూడా షార్ట్‌గా మారిపోతోంది. వంద పదాల్లో చెప్పే విషయాలను ఎమోజీ, స్టిక్కర్ల రూపంలో చెప్పేస్తున్నారు...
Whatsapp: ప్రస్తుతం టాకింగ్ కంటే ఎక్కువగా చాటింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ చాటింగ్ కూడా షార్ట్‌గా మారిపోతోంది. వంద పదాల్లో చెప్పే విషయాలను ఎమోజీ, స్టిక్కర్ల రూపంలో చెప్పేస్తున్నారు. చెప్పాల్సిన విషయాన్ని సుత్తి లేకుండా, సూటిగా చెప్పేస్తున్నారు. స్టిక్కర్లను స్వయంగా తయారు చేసుకునేందుకు గాను రకరకాల థార్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగిస్తున్నారు.
సొంత ఫొటోలను స్టిక్కర్స్‌గా మార్చుకునే వెసులుబాటును కొన్ని యాప్స్ కలిపించాయి. ఇదిలా ఉంటే వాట్సాప్ ఇన్‌బిల్ట్‌గా ఇలాంటి ఫీచర్‌ను అందించింది. వాట్సాప్‌లోనే నేరుగా స్టిక్కర్‌ను తయారు చేసుకోవచ్చు. వాట్సాప్‌లో స్టిక్కర్లను ఎలా తయారు చేసుకోవచ్చో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం..
* ఫొటోను స్టిక్కర్‌గా మార్చుకోవాలనుకుంటే ముందుగా కంప్యూటర్‌లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయాలి.
* అనంతరం కాంటాక్ట్ లిస్ట్‌లోకి వెళ్లి మీకు నచ్చిన కాంటాక్ట్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* తర్వాత ‘స్మైలీ’ సింబల్ పక్కన ఉన్న పేపర్ క్లిప్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* అనంతరం అందులోని ‘స్టిక్కర్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* స్టిక్కర్ ఆప్షన్‌ను ఎంచుకోగానే గ్యాలరీలో ఉన్న ఫొటోలు కనిపిస్తాయి. అందులో మీరు స్టిక్కర్‌గా మార్చాలనుకుంటున్న ఫొటోను ఎంచుకోవాలి.
* వెంటనే ఫొటో స్టిక్కర్‌గా మారిపోతుంది. అనంతరం మీకు కావాల్సినట్లుగా ఫొటోను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
* చివరిగా స్టిక్కర్‌ను సేవ్ చేసుకొని. మీరు సెలక్ట్ చేసుకున్న కాంటాక్ట్‌కు పంపొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..