Smart Phone: కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? ర్యామ్ విషయంలో ఆ తప్పు చేస్తే ఇక అంతే..!

ఇటీవల కాలంలో దేశంలో ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వినియోగించే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయంటే వాటి వాడకం ఎలా ఉందో? అర్థం చేసుకోవచ్చు. అయితే స్మార్ట్ ఫోన్‌ను కొత్తగా కొనుగోలు చేసే వారు ప్రస్తుత వాడకానికి అనుగుణంగా చేసే చిన్న తప్పులు పెద్ద నష్టాన్ని చేకూరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

Smart Phone: కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? ర్యామ్ విషయంలో ఆ తప్పు చేస్తే ఇక అంతే..!
Smartphones

Updated on: May 09, 2025 | 5:30 PM

గతంలో ఫోన్ అంటే కేవలం కాల్స్‌, మెసేజ్‌లకు మాత్రమే వినియోగించే వారు. కానీ ఇప్పుడు ప్రతి అవసరానికి స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా కావాల్సి వస్తుంది. ప్రస్తుతం చాలా మంది స్మార్ట్ ఫోన్స్‌ను ఈ-కామర్స్ సైట్స్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి యాప్స్‌లో త్వరలో పెద్ద ఎత్తున ఆఫర్స్ రానున్నాయి. కాబట్టి స్మార్ట్ ఫోన్ లవర్స్ ఫోన్ కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ర్యామ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్‌లో మొబైల్ యాప్‌లతో పాటు గేమ్‌లు ర్యామ్‌పై అదనపు భారాన్ని వేస్తున్నాయి. ఫలితంగా సరైన ర్యామ్ లేకపోతే ఫోన్ పనితీరు పేలవంగా మారుతుంది. 

మీరు స్మార్ట్ ఫోన్‌ను సాధారణంగా వినియోగిస్తే అంటే కాలింగ్, సోషల్ మీడియా, మ్యూజిక్, వీడియో స్ట్రీమింగ్ వంటి పనుల కోసం ఫోన్ కొనుగోలు చేస్తుంటే 8 జీబీ ర్యామ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ మీకు ఉత్తమ ఎంపిక అని టెక్ నిపుణులు అంటున్నారు. ఈ స్థాయి ర్యామ్ ఉన్న ఫోన్ ఉంటే సున్నితమైన మల్టీ టాస్కింగ్ చేయవచ్చు. అలాగే ర్యామ్‌తో పాటు ప్రాసెసర్ కూడా మెరుగ్గా ఉండాలని నిపుణులు వివరిస్తున్నారు.  అలాగే మీరు స్మార్ట్ ఫోన్ ద్వారా ఎక్కువగా గేమ్స్ ఆడుతుంటే లేదా ఎడిటింగ్ యాప్‌లను ఉపయోగిస్తే మీరు కనీసం 12 జీబీ లేదా 16 జీబీ ర్యామ్ ఉన్న పరికరాన్ని ఎంచుకోవాలని నిపుణులు వివరిస్తున్నారు. 16 జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ వినియోగిస్తే 5 నుంచి 6 సంవత్సరాల వరకు లాగ్ ఫ్రీ పనితీరును పొందవచ్చు.

16 జీబీ ర్యామ్ ఉన్న ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

  • వన్‌ప్లస్ 13
  • ఆసస్ రాగ్ ఫోన్ 9 ప్రో
  • నుబియా రెడ్‌మాజిక్ 10 ప్రో
  • వివో ఎక్స్ 200 ప్రో
  • శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా