Stress Monitoring: ప్రస్తుతం పెరుగుతున్న పని భారం మధ్య ఒక వ్యక్తి ఎప్పుడు ఒత్తిడికి గురవుతాడో తెలియని పరిస్థితి నెలకొంది. అటువంటి పరిస్థితుల్లో ఒత్తిడిని ఎప్పకప్పుడు గుర్తించేందుకు ఓ గడియారాన్ని తయారు చేశారు పరిశోధకులు. ఈ వాచ్ ఒత్తిడికి గంట ముందు సదరు వ్యక్తిని హెచ్చరిస్తుంది. ఈ వాచ్ పేరు Nowwatch. ఒక వ్యక్తి గురయ్యే ఒత్తిడిని గుర్తించి తగిన సూచనలు, సలహాలు అందజేస్తుంది. శరీరం ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను విడుదల చేస్తుంది. ఈ గడియారం ఈ హార్మోన్‌ను ట్రాక్ చేస్తుంది. ఒక వ్యక్తి ఈ గడియారాన్ని ధరించినప్పుడు అది అతని శరీరం నుండి వచ్చే చెమటను తనిఖీ చేస్తుంది. శరీరంలో ఈ హార్మోన్ స్థాయి పెరిగినట్లు వెంటనే గుర్తించేలా పని చేస్తుంది.
ఒక వ్యక్తి ఒత్తిడికి గురవుతున్నాడా లేదా అనే విషయాన్ని వాచ్ ట్రాక్ చేస్తూ ఆడియో ద్వారా కూడా సలహా ఇస్తుంది. ఉదాహరణకు ఈ గడియారం ధరించిన వ్యక్తి ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే దీర్ఘంగా శ్వాస తీసుకోవాలని చెబుతుంది. అంతేకాదు.. ఆ వ్యక్తిని తాను ఉన్న స్థలం నుండి లేచి కొంత దూరం నడవమని సలహా ఇస్తుంది కూడా. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఒత్తిడికి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ వాచ్ నుంచి హెచ్చరికలను పొందడం ద్వారా మానవులలో ఒత్తిడిని ప్రారంభ దశలో నియంత్రించవచ్చని వాచ్ తయారు చేసిన కంపెనీ చెబుతోంది.
ఈ వాచ్ చెమట ద్వారా ఒత్తిడిని ఎలా గుర్తిస్తుంది..?
చెమటలో ఉండే హార్మోన్లను గుర్తించే గడియారంలో ఏముందనే అనుమానం రావచ్చు. వాస్తవానికి డేటా అల్గోరిథం ఎలక్ట్రికల్ సెన్సార్ Nowatch వాచ్‌లో ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. ఇది మనిషి ఒత్తిడికి గురయ్యే పరిస్థితులను గుర్తించేందుకు సహాయపడుతుంది. DailyMail ప్రకారం.. ఈ వాచ్ లాస్ వెగాస్‌లో జరగనున్న CES సమావేశంలో ప్రదర్శించబడుతుంది. దీని ధర దాదాపు 57 వేల రూపాయలు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ వాచ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ వాచ్ ద్వారా ఒత్తిడిని చాలా వరకు నియంత్రించవచ్చని కంపెనీ చెబుతోంది.
ఇవి కూడా చదవండి: