అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికతతో ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయింది. ఎక్కడ , ఏమూల ఏది జరిగినా ఇట్టే సమాచారం చేరిపోతోంది. అయితే ఇదే సాంకేతికతతో చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా సైబర్ నేరాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. ఎంతలా సెక్యూరిటీ కల్పిస్తున్నా.. సైబర్ నేరగాళ్లు ఏదో రకంగా డేటా చోరీ చేసి.. వాళ్ల చెప్పు చేతల్లోకి తీసుకుంటున్నారు. ఇందులో ఆధార్ నంబర్ ట్యాంపరింగ్ చాలా ప్రమాదకరమైనది. ప్రస్తుతం మన బ్యాంకు అకౌంట్ల దగ్గర నుంచి పాన్ కార్డు, రిజిస్ట్రేషన్లు ఇలా ఏది కావాలన్నా ఆధార్ అథంటికేషన్ తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. ఇదే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతోంది. ఒక్క ఆధార్ యాక్సస్ చేస్తే చాలా వినియోగదారుల సమస్త డేటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయినట్లే. అందుకనే ఆధార్ బహిర్గతం కాకుండా కాపాడుకోవడం.. దానిని భద్రపరచుకోవడం చాలా కీలకం. అందుకోసమే ప్రభుత్వం ఏ మంచి ఫీచర్ ను ఆధార్ భద్రత కోసం తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఒక్క ఎస్ఎంఎస్ తో మీ ఆధార్ నంబర్ లాక్ చేసుకోవచ్చు. ఇక దాని ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపకుండా భద్రం చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలి? దీని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందగలం? ఇప్పుడు తెలుసుకుందాం..
ఆధార్ కార్డ్ వినియోగదారులు ఎస్ఎంఎస్ ద్వారా తమ ఆధార్ నంబర్‌లను లాక్ లేదా అన్‌లాక్ చేయవచ్చు. మీరు ఒక్కసారి మీ ఆధార్ నెంబర్‌ను లాక్ చేస్తే ఇక ఎవరూ మీ ఆధార్ నెంబర్‌ను ఉపయోగించలేరు. ఆధార్ డెమొగ్రఫిక్, బయోమెట్రిక్, ఓటీపీ లాంటి ఆథెంటికేషన్ సేవలేవీ పనిచేయవు. ఆధార్ లాక్ చేయడానికి ముందు మీరు వర్చువల్ ఐడీ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ అన్‌లాక్ చేయాలంటే ఈ వర్చువల్ ఐడీ తప్పనిసరి. ఎస్ఎంఎస్‌తో లేదా UIDAI వెబ్‌సైట్‌లో వర్చువల్ ఐడీ జెనరేట్ చేయొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..