ఆధార్ నంబర్.. ప్రతి భారతీయ పౌరుడికి ఓ గుర్తింపు. ఇది ఉంటేనే ప్రభుత్వ నుంచి ఏ పథకమైనా మంజూరవుతుంది. బ్యాంకు ఖాతా కావాలన్నా, లైసెన్సు, రిజిస్ట్రేషన్ ఇలా ఏది కావాలన్నా ఆధార్ నంబర్ తప్పనిసరి. ఇంత ప్రాధాన్యం ఉన్న ఆధార్ నంబర్ భద్రత విషయంలో కూడా కాస్త అప్రమత్తంగానే ఉండాలి. నేరగాళ్ల చేతుల్లోకి మీ ఆధార్ నంబర్ వెళ్తే వారు దానిని అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించే అవకాశం. అందుకే ఆధార్ కాపీలను ఎక్కడపడితే అక్కడ ఇవ్వవద్దని ప్రభుత్వం సూచిస్తుంది. అయితే ఈ ఆధార్ కార్డుకు మరింత భద్రతను పెంచుతూ మాస్క్‌డ్ ఆధార్ కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) తీసుకొచ్చింది. ఇది అవసరమైన డేటా వరకూ మాత్రమే బయట వ్యక్తులు చూపి.. నంబర్ ను దాచి ఉంచుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
డౌన్‌లోడ్ చేసుకునే ఈ-ఆధార్‌లో నంబర్లు అన్నీ కనిపించకుండా చేసుకోవడమే ఈ మాస్క్‌డ్ ఆధార్ ఉపయోగమని యూఐడీఏఐ పేర్కొంటోంది. ఆధార్ నంబర్లు 12 ఉంటాయి. అయితే ఈ మాస్క్‌డ్ ఆధార్ డౌన్‌లోడ్ చేసుకుంటే అందులోని తొలి ఎనిమిది నంబర్లు XXXX-XXXX అని మాస్క్ అయి కనిపిస్తాయి. చివరి నాలుగు నంబర్లు మాత్రం కనిపిస్తాయి.
ఇది వినియోగదారుడి ప్రైవసీని కాపాడుతుంది. అలాగే ఆధార్ కార్డు అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించకుండా సంరక్షిస్తుంది. దీనిని దాదాపు అన్ని ఆర్గనైజేషన్స్ అంగీకరిస్తాయి. ఆధార్ నంబర్ తప్పకుండా సమర్పించాల్సిన అవసరం లేని.. కేవలం ఈ-కేవైసీ మాత్రం ఇవ్వాల్సిన సందర్భాల్లో మాస్క్‌డ్ ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..