4K TVs Under 25K: 43 అంగుళాల స్మార్ట్ టీవీలు.. 4కే రిజల్యూషన్‌తో.. కేవలం రూ. 25వేలలోపు ధరలోనే.. మిస్ కావొద్దు..
మంచి పిక్చర్ క్వాలిటీ, నాణ్యమైన సౌండ్ క్లారిటీతో కూడిన టీవీ కావాలంటే మీ జేబుపై అధిక భారం పడటం ఖాయం. అయితే అదృష్టవశాత్తూ మనం దేశంలో తక్కువ ధరలోనే 4కే రిజల్యూషన్ తో కూడిన ఆండ్రాయిడ్ టీవీలు ఆన్ లైన్ లో లభ్యమవుతున్నాయి. అవికూడా మిడ్ రేంజ్లోనే అంటే రూ. 25,000 ధరలోనే ప్రపంచంలో ఉత్తమ బ్రాండ్లలో ఒకటైన రెడ్ మీ అలాగే ఏసర్, టుషీబా, హై సెన్స్ వంటి స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి.
మనలో ప్రతి ఒక్కరికీ మంచి నాణ్యతతో కూడిన వస్తువులను తక్కువ ధరకే కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉంటుంది. కానీ ప్రీమియం క్వాలిటీతో కూడిన ఉత్పత్తులు తక్కువ ధరకు దొరకడం అరుదు. అందుకే కనీసం మిడ్ రేంజ్ వరకూ అన్న వెళ్లడానికి ఇష్టపడుతుంటాం. అలాగే టెలివిజన్ ల విషయంలో కూడా ఇదే తరహాలో వ్యవహారం ఉంటుంది. మంచి పిక్చర్ క్వాలిటీ, నాణ్యమైన సౌండ్ క్లారిటీతో కూడిన టీవీ కావాలంటే మీ జేబుపై అధిక భారం పడటం ఖాయం. అయితే అదృష్టవశాత్తూ మనం దేశంలో తక్కువ ధరలోనే 4కే రిజల్యూషన్ తో కూడిన ఆండ్రాయిడ్ టీవీలు ఆన్ లైన్ లో లభ్యమవుతున్నాయి. అవికూడా మిడ్ రేంజ్లోనే అంటే రూ. 25,000 ధరలోనే ప్రపంచంలో ఉత్తమ బ్రాండ్లలో ఒకటైన రెడ్ మీ అలాగే ఏసర్, టుషీబా, హై సెన్స్ వంటి స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. వాటిని మీకు ఓ జాబితా చేసి అందిస్తున్నాం. మీరు టీవీ కొనుగోలు చేయాలనుకుంటే.. అది కూడా తక్కువ ధరలో 4కే రిజల్యూషన్ కావాలనుకుంటే ఈ ఆప్షన్స్ బెస్ట్. ఓ సారి పరిశీలించండి..
రెడ్ మీ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ.. ఇది తక్కువ ధరకు అందుబాటులో ఉన్న బెస్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ. 43 అంగుళాల స్క్రీన్ సైజ్ ఉంటుంది. 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో పాటు 3840*2160 పిక్సల్స్ అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్ ఉంటుంది. 30 వాట్ ఆడియో అవుట్ పుట్ డాల్బీ ఆడియో ఫీచర్స్ తో వస్తుంది. 178 డిగ్రీల వైడ్ యాంగిల్ వ్యూ ఉంటుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్, క్రోమ్ కాస్ట్, మైరా కాస్ట్ ఆప్షన్లు ఉంటాయి. వైఫై, యూఎస్బీ, ఎథర్ నెట్, హెచ్ డీ ఎంఐ కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ స్పేస్ ఇస్తారు. గూగుల్ అసిస్టెంట్ కు సపోర్టు చేస్తుంది. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 24,999గా ఉంది.
ఏసర్ 43 అంగుళాల ఐ సిరీస్ 4కే అల్ట్రా హెచ్ డీ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ.. లీడింగ్ టెక్ బ్రాండ్ అయిన ఏసర్ నుంచి వస్తున్న స్మార్ట్ టీవీ ఇది. దీనిలో అన్ని రకాల ఓటీటీ యాప్స్ ఉంటాయి. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్, జీ5, సోనీ లివ్, వూట్, యూట్యూబ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి యాప్స్ ఉంటాయి. 60 హెర్జ్ రిఫ్రెష్ట తో పాటు 3840*2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో వస్తుంది. 178 డిగ్రీల వైడ్ యాంగిల్ వ్యూ ఇస్తుంది. 30 వాట్ల ఆడియో అవుట్ పుట్ ఇచ్చే టాప్ నాట్చ్ హై ఫెడెలిటీ స్పీకర్స్ అండ్ డాల్బీ ఆడియో ఫీచర్స్ ఉంటాయి. దీనిలో 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 5 పిక్చర్ మోడ్స్, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, హెచ్ డీఎంఐ పోర్టులు, యూఎస్బీ పోర్టులు ఉంటాయి. దీని ధర అమెజాన్ లో రూ. 22,999గా ఉంది.
టొషిబా 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ.. దిగ్గజ టెక్ బ్రాండ్ అయిన టొషిబా నుంచి వస్తున్న 4కే టీవీ ఇది. దీనిలో 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో కూడిన బెజెల్ లెస్ డిజైన్తో వస్తుంది. దీనిలో మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. గూగుల్ టీవీ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ తో పాటు క్రోమ్ కాస్ట్, మైరా కాస్ట్, డీఎల్ఎన్ఏ, ఎయిర్ ప్లే వంటి ఫీచర్స్ ఉంటాయి. డాల్బీ విజన్, హెచ్డీఆర్ 10, హెచ్ఎల్జీకి సపోర్టు చేస్తుంది. పలు ఓటీటీ యాప్స్ లు ఇన్ బిల్ట్ ఉంటాయి. దీని ధర అమెజాన్ లో రూ. 24,999గా ఉంది.
టీసీఎల్ 43 అంగుళాల బెజెల్ లెస్ సిరీస్ 4కే అల్ట్రా హెచ్ డీ ఎల్ఈడీ గూగుల్ టీవీ.. ఇది కూడా 60 హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ఉంటుంది. 3840*2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో వస్తుంది. హెచ్ డీ ఎంఐ, యూఎస్బీ కనెక్టవిటీ తో పాటు నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ ఫారంలకు సపోర్టు చేస్తుంది. 178 డిగ్రీల వైడ్ యాంగిల్ వ్యూయింగ్ ఉంటుంది. హెచ్డీఆర్ 10 క్వాలిటీతో పిక్చర్ ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 24,990గా ఉంది.
హై సెన్స్ 43 అంగుళాల బెజెల్ లెస్ సిరీస్ 4కే అల్ట్రా హెచ్ డీ ఎల్ఈడీ గూగుల్ టీవీ.. మీకు రూ. 20,000లోపే 4కే టీవీ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. దీనిలో కూడా టాప్ క్లాస్ ఫీచర్స్, స్పెసిఫికేషన్లు ఉంటాయి. 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో కూడిన 3840*2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో వస్తుంది. దీనిలో మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు ఉంటాయి. 24 వాట్ల సామర్థ్యంతో కూడిన సౌండ్ అవుట్ పుట్ డాల్బీ అట్మోస్, డాల్బీ డిజిటల్ ఫీచర్లతో వస్తుంది. ఫార్ ఫీల్డ్ వాయిస్ కంట్రోల్, గూగుల్ టీవీ, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ మైరా కాస్ట్, డీఎల్ఎన్ఏ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ టీవీ ధర అమెజాన్ లో రూ. 19,999గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..