మన సూర్యుడు పుట్టిన సమయంలో చిత్రాన్ని తీయగలిగితే.. అది ఇలాగే ఉండేది

మన సూర్యుడు పుట్టిన సమయంలో చిత్రాన్ని తీయగలిగితే.. అది ఇలాగే ఉండేది

Phani CH

|

Updated on: Sep 22, 2023 | 9:59 AM

విశ్వంలో ఎన్నో రహస్యాలున్నాయి. విశ్వం, గ్రహాల ఆవిర్భావాన్ని ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ఎంతో శ్రమిస్తున్నారు. వీరికి జేమ్స్‌వెబ్‌ టెలిస్కోప్‌ ఎంతో సహాయం అందిస్తుంది. ఈ భారీ టెలీస్కోప్‌ తాజాగా మరో అద్భుతమైన చిత్రాన్ని క్లిక్‌ మనిపించింది. భూమికి వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడి వంటి కొత్తగా నక్షత్రం ఏర్పడుతున్న చిత్రాన్ని తీసి భూమిపైకి పంపింది. కాంతి సూపర్‌సోనిక్‌ వేగంతో చీలిపోతున్న దృశాన్ని టెలిస్కోప్‌ బంధించింది.

విశ్వంలో ఎన్నో రహస్యాలున్నాయి. విశ్వం, గ్రహాల ఆవిర్భావాన్ని ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ఎంతో శ్రమిస్తున్నారు. వీరికి జేమ్స్‌వెబ్‌ టెలిస్కోప్‌ ఎంతో సహాయం అందిస్తుంది. ఈ భారీ టెలీస్కోప్‌ తాజాగా మరో అద్భుతమైన చిత్రాన్ని క్లిక్‌ మనిపించింది. భూమికి వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడి వంటి కొత్తగా నక్షత్రం ఏర్పడుతున్న చిత్రాన్ని తీసి భూమిపైకి పంపింది. కాంతి సూపర్‌సోనిక్‌ వేగంతో చీలిపోతున్న దృశాన్ని టెలిస్కోప్‌ బంధించింది. దీంతో నక్షత్రాలు ఏర్పడే ప్రక్రియ తెలుసుకోవచ్చని.. అలాగే సూర్యుడి గురించి తెలుసుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫొటోను ట్విట్టర్‌లో నాసా పోస్ట్‌ చేసింది. కొత్తగా ఏర్పడే నక్షత్రం చుట్టూ కనిపించే కాంతిని హెర్బీస్‌ హాలో అంటారని, ఈ నక్షత్రం భూమికి వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో ఉందని తెలిపింది. ‘మన సూర్యుడు పుట్టిన సమయంలో చిత్రాన్ని తీయగలిగితే.. అది ఇలాగే ఉండేదని’ అమెరికన్‌ స్పేస్‌ ఏజెన్సీ పేర్కొంది. జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ తీసిన ఈ ఫొటోలో కొత్తగా జన్మించిన నక్షత్రం కనిపిస్తుండగా.. దాని నుంచి పోల్‌ గ్యాస్‌ సూపర్‌ సోనిక్‌ వేగంతో దూరంగా విసిరివేస్తున్నట్లుగా ఉన్నది. ఈ నక్షత్రానికి ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుందని.. కాలం గడిచే కొద్ది సూర్యుడిలా మారుతుందని తెలిపింది. నక్షత్రం నుంచి రెండువైపులా దూసుకెళ్లిన గ్యాస్‌ చుట్టూ ఉండే వాయువులు, ధూళితో ఢీకొని హెర్బీస్‌ హాలోగా ఏర్పడుతుందని నాసా తెలిపింది. ఈ నక్షత్రం బరువు మన సూర్యుడి బరువులో ఎనిమిది శాతం మాత్రమే ఉంటుందని.. క్రమక్రమంగా సూర్యుడి ఆకృతిలోకి మారుతుందని చెప్పింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గణపతి చేతిలో లడ్డూను ఎత్తుకెళ్ళిన దొంగ.. సీసీటీవీ కెమెరాలో రికార్డు

Balagam: వావ్.. 2024 ఆస్కార్ రేసులో బలగం.. ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చూసేయండి

TOP 9 ET News: రాహుల్‌ , రతిక ప్రైవేట్‌ ఫోటోలు లీక్‌ | మంచు విష్ణుకి షాకిచ్చిన హీరోయిన్‌

Rahul Sipligunj – Rathika: నెట్టింట లీకైన రాహుల్ – రతిక ప్రైవేట్ ఫోటోస్‌

Salaar: సలార్ దిమ్మతిరిగే పంచ్‌.. ఇక ఈ సంవత్సరం కూడా లేనట్టే !!