Hacking: హ్యాకింగ్ బారిన పడొద్దంటే ముందు ఈ పని చేయండి.. తప్పక తెలుసుకోండి..

|

Apr 24, 2023 | 7:20 AM

ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అయిపోయింది. యావత్ ప్రపంచం డిజిటలైజేషన్‌లో దూసుకెళ్తోంది. అరచేతిలోనే ఇమిడిపోయే స్మార్ట్ ఫోనే సర్వస్వం అయిపోతుంది. ఒక వ్యక్తి, కుటుంబం, వ్యవస్థ ఇలా సమస్త సమాచారం ఆ ఫోన్‌లోనే అందుబాటులో ఉంటుంది. దీని వల్ల బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో.. ప్రమాదం కూడా అంతే స్థాయిలో పొంచి ఉంది. అదే ఇప్పుడు అందరిపాలిట శాపంలా మారుతోంది.

Hacking: హ్యాకింగ్ బారిన పడొద్దంటే ముందు ఈ పని చేయండి.. తప్పక తెలుసుకోండి..
Password
Follow us on

ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అయిపోయింది. యావత్ ప్రపంచం డిజిటలైజేషన్‌లో దూసుకెళ్తోంది. అరచేతిలోనే ఇమిడిపోయే స్మార్ట్ ఫోనే సర్వస్వం అయిపోతుంది. ఒక వ్యక్తి, కుటుంబం, వ్యవస్థ ఇలా సమస్త సమాచారం ఆ ఫోన్‌లోనే అందుబాటులో ఉంటుంది. దీని వల్ల బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో.. ప్రమాదం కూడా అంతే స్థాయిలో పొంచి ఉంది. అదే ఇప్పుడు అందరిపాలిట శాపంలా మారుతోంది. హ్యాకింగ్ రూపంలో ప్రతి వ్యక్తి గోప్యతకు ముప్పు పెరుగుతోంది. ఈ హ్యాకింగ్‌కు తోడు AI టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. దాంతో హ్యాకర్లకు కీలక ఆయుధం దొరికినట్లయ్యింది. ఈ నేపథ్యంలోనే మీరు వినియోగించే అన్ని సోషల్ మీడియా అకౌంట్స్, ఈమెయిల్స్, బ్యాంక్ అకౌంట్ సహా అన్నింటికీ బలమైన పాస్‌వర్డ్స్ ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. బలహీనమైన పాస్‌వర్డ్స్ పెట్టడం ద్వారా మీ అకౌంట్స్‌ని హ్యాకర్లు సులభంగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. మరి స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌ను ఏం సెట్ చేయాలి? ఎలా సెట్ చేయాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా ఏ హ్యాకర్ లేదా AI టెక్నాలజీ ఛేదించలేని బలమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేయొచ్చు.

స్ట్రాంగ్ పాస్‌వర్డ్ చిట్కాలు..

1. స్ట్రాంగ్ పాస్‌వర్డ్ కోసం కనీసం 12 అక్షరాలను ఉపయోగించాలి.

2. పెద్ద, చిన్న అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక సింబల్స్ కలయికతో పాస్‌వర్డ్ సెట్ చేయాలి.

ఇవి కూడా చదవండి

3. పాస్‌వర్డ్‌లో వ్యక్తిగత వివరాలను ఉపయోగించకూడదు. పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటివి అస్సలు పెట్టొద్దు.

4. ప్రతి అకౌంట్‌కు ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేయండి.

పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..

పాస్‌వర్డ్‌ని సెట్ చేస్తున్నప్పుడు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాగాలను ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఎంత ఎక్కువ కాంపోనెంట్‌లను ఉపయోగిస్తే, మీ పాస్‌వర్డ్ అంత స్ట్రాంగ్‌గా మారుతుంది. ఇది కాకుండా, మీ పాస్‌వర్డ్ మీకు తప్ప మరెవరికీ తెలియదని కన్ఫామ్ చేసుకోవాలి. ఇందుకోసం మీ పాస్‌వర్డ్‌ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు ఎవరికీ తెలియని పాస్‌వర్డ్‌ను సృష్టించవచ్చు. సురక్షితంగా ఉంటారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..