Google: స్మార్ట్‌ఫోన్‌లపై గూగుల్‌ సంచలన నిర్ణయం.. ఈ ఫోన్‌లలో జీమెయిల్‌, యూట్యూబ్‌ ఇక పని చేయవు..!

| Edited By: Phani CH

Aug 01, 2021 | 8:57 AM

Google: ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కలిగివున్న స్మార్ట్‌ఫోన్‌లపై గూగుల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. పాత ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ వర్షన్‌ను కలిగివున్నన ఆండ్రాయిడ్‌..

Google: స్మార్ట్‌ఫోన్‌లపై గూగుల్‌ సంచలన నిర్ణయం.. ఈ ఫోన్‌లలో జీమెయిల్‌, యూట్యూబ్‌ ఇక పని చేయవు..!
Google
Follow us on

Google: ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కలిగివున్న స్మార్ట్‌ఫోన్‌లపై గూగుల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. పాత ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ వర్షన్‌ను కలిగివున్నన ఆండ్రాయిడ్‌ ఫోన్‌లకుగూగుల్‌ అకౌంట్లలోకి సైన్‌ఇన్‌ అవ్వకుండా మద్దతును గూగుల్‌ ఉపసంహరించుకుంది. 2.3.7 వర్షన్‌ లేదా అంతకంటే తక్కువ వర్షన్‌తో నడుస్తోన్న ఆండ్రాయిడ్ ఫోన్‌లలో సైన్ ఇన్‌లకు గూగుల్‌ తన సపోర్ట్‌ను నిలిపివేయనుంది. అయితే గూగుల్‌ తీసుకున్న ఈ నిర్ణయం 2021 సెప్టెంబర్ 27 నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది.

తక్కువ వర్షన్‌ వాడుతున్న యూజర్లకు ఈ-మెయిల్‌

కాగా, తాజాగా 2.3.7 కంటే తక్కువ వర్షన్‌ వాడుతున్న యూజర్లకు గూగుల్‌ సంబంధిత ఈ-మెయిల్‌ను పంపింది. 2.3.7 వర్షన్‌ను వాడుతున్న యూజర్లను కనీసం ఆండ్రాయిడ్‌ 3.0 హనీకోంబ్‌ వోఎస్‌కు తమ స్మార్ట్‌ఫోన్లను ఆప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఒక వేళ అప్‌డేట్‌ చేయకపోతే జీమెయిల్‌, గూగుల్‌ సెర్చ్‌, గూగుల్‌ డ్రైవ్‌, యూట్యూబ్‌, ఇతర గూగుల్‌ సేవలను యాప్‌ల ద్వారా పొందలేరని వెల్లడించింది. వీటిని ఫోన్‌ బ్రౌజర్లో యూజర్లు పొందే అవకాశం ఉన్నట్లు గూగుల్‌ పేర్కొంది.

ప్రస్తుత కాలంలో ఆండ్రాయిడ్‌ 3.0 వర్షన్‌ దాని కంటే తక్కువ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ వర్షన్‌ అతి తక్కువమంది యూజర్లు వాడుతున్నారని గూగుల్‌ తెలిపింది. యూజర్ల భద్రత, డేటాను దృష్టిలో ఉంచుకొని గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 27 నుంచి ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.3.7 ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఆయా గూగుల్‌ యాప్స్‌లో లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తే యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ ఏర్రర్‌ వస్తుందని గూగుల్‌ స్పష్టం చేసింది. యూజర్ల సాఫ్ట్‌వేర్‌ని అప్‌డేట్ చేయమని లేదా ఫోన్‌లను మార్చమని గూగుల్‌ ప్రోత్సహిస్తుంది. గూగుల్‌ తీసుకున్న నిర్ణయంతో ఈ ఆండ్రాయిడ్‌ వర్షన్‌ను కలిగివున్న స్మార్ట్‌ఫోన్లను కొత్త ఫోన్లతో రిప్లేస్‌ చేయాల్సి వస్తుంది.

ఇవీ కూడా చదవండి

Mi Power Bank: షియోమీ ఎంఐ హైపర్‌సోనిక్ పవర్ బ్యాంక్ .. ఫాస్ట్‌ 50w చార్జింగ్‌.. 20000 ఎంఏహెచ్‌ ధర ఎంతంటే..!

KYC: డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు ఉన్న వారికి హెచ్చరిక.. కేవైసీ పెండింగ్‌లో ఉంటే అకౌంట్లు కట్‌..!