గూగుల్ లెన్స్ ఇప్పుడు డెస్క్‌టాప్ వెర్షన్‌లో కూడా..! ఇకనుంచి ఇమేజ్‌పై ఉన్న టెక్ట్స్ ఆటోమేటిక్‌గా సేవ్..
Google Photos : నిత్యం మొబైల్ వాడే మనం ప్రతి రోజు ఎన్నో ఫొటోలు తీసుకుంటూ ఉంటాం.. ఇంకా చెప్పాలంటే సెల్ఫీలకు కొదవే ఉండదు. ఇది కాకుండా
Google Photos : నిత్యం మొబైల్ వాడే మనం ప్రతి రోజు ఎన్నో ఫొటోలు తీసుకుంటూ ఉంటాం.. ఇంకా చెప్పాలంటే సెల్ఫీలకు కొదవే ఉండదు. ఇది కాకుండా పండుగలు, పెళ్లిళ్లకు లెక్కలేనన్ని ఫొటోలు తీస్తూ ఉంటాం.. ఇవన్నీ ఫోన్ మెమురీలో సేవ్ అవుతుంటాయి. దీంతో మొబైల్‌పై లోడ్ ఎక్కువవుతూ ఉంటుంది అందుకే వాటిని మళ్లీ గూగుల్ ఫొటోస్‌లో భద్రపరుస్తాం.. ఇక్కడి వరకు బాగానే ఉంది అయితే ఇక్కడ ప్రతి ఫొటోకు ఒక సమాచారం ఉంటుంది. దానిని గుర్తించడానికే ‘గూగుల్ లెన్స్’ను ప్రస్తుతం డెస్క్‌టాప్ వెర్షన్‌లో కూడా అందుబాటులో తీసుకొచ్చింది గూగుల్. చిత్రంలోని టెక్ట్స్‌ను గుర్తించేందుకు గూగుల్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (OCR) అనే ఫీచర్ వాడుతున్నారు.
‘ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లలో అందుబాటులో ఉన్న గూగుల్ లెన్స్’ ఫీచర్‌కు తాజాగా డెస్క్‌టాప్ వెర్షన్ విడుదలైంది. ఇమేజ్‌పై ఉన్న టెక్ట్స్ ఆధారంగా ఈ విషయాలను గూగుల్ ఆటోమేటిక్‌గా గుర్తించి, దాని నుంచి టెక్ట్స్ కాపీ చేస్తుంది. గూగుల్ లెన్స్ అనేది విజన్-బేస్డ్ కంప్యూటింగ్ కేపబిలిటీ. టెక్ట్స్ కాపీ చేయడానికి లేదా అనువదించడానికి.. మొక్కలు, జంతువులను గుర్తించడానికి.. మెనూల అన్వేషణ, ప్రొడక్ట్స్ డిస్కవరీతో పాటు సిమిలర్ ఫొటోగ్రాఫ్స్ కనుగొనడానికి దీన్ని ఉపయోగించవచ్చు.
ఉదాహరణకు మీరు తీసిన ఫొటో మీద క్లిక్ చేసి గూగుల్ లెన్స్ ఆన్ చేస్తే.. ఆ ఫొటో ఎక్కడ తీశారో చెబుతుంది. అంతేకాదు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా కంపెనీ పేరు కనిపిస్తే, అందుకు సంబంధించిన వివరాలను మీ ముందుంచుతుంది. బార్ కోడ్ వివరాలు స్కాన్ చేస్తే, ఆ వివరాలన్నిటినీ చూసుకోవచ్చు. అయితే ఆ ఫొటోలో అక్షరాలు క్లియర్‌గా కనిపించాలి. అయితే గూగుల్ ఫొటోల డెస్క్‌టాప్ వెర్షన్‌లో గూగుల్ లెన్స్ ఫీచర్స్ అన్నీ అందుబాటులో ఉండవని గుర్తుంచుకోండి.