AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Meet: గూగుల్ మీట్‌లో మరో కొత్త ఫీచర్.. మొబైల్ యూజర్లకు ఇక పండగే..

ఈ నేపథ్యంలో వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని గూగుల్ మీట్ ఈ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే ఇది మీ పరిస్థితిని అర్థం చేసుకోవడం ద్వారా మీటింగ్ సెట్టింగ్‌లను ఆటోమేటిక్‌గా మారుస్తుంది.

Google Meet: గూగుల్ మీట్‌లో మరో కొత్త ఫీచర్.. మొబైల్ యూజర్లకు ఇక పండగే..
Google Meet
Madhu
|

Updated on: Jun 13, 2023 | 4:30 PM

Share

మీరు మార్నింగ్ వాక్‌, లేదా ఈవెనింగ్ కి వెళ్లారనుకోండి.. ఆ సమయంలో అనుకోకుండా ఆఫీసు నుంచి అత్యవసర మీటింగ్ అని వెంటనే గూగుల్ మీట్ లో జాయిన్ అవ్వమని మెసేజ్ వచ్చిందనుకోండి.. ఏం చేస్తారు? వాకింగ్ మధ్యలో ఆపేసి వచ్చి ల్యాప్ టాప్ ముందు కూర్చోవడమో లేక, అక్కడ ఏదో ఒక ప్రదేశంలో ఫోన్ ద్వారా మీటింగ్ ని అటెండ్ చేయడమో చేస్తారు. అయితే దీనివల్ల మీరు అనుకున్న ప్లాన్ డిస్టర్బ్ అవడంతో పాటు బయట మీటింగ్ కి అటెండ్ అయితే రకరకాల శబ్దాల వల్ల ఇబ్బదులు ఏర్పడవచ్చు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు గూగుల్ మీట్ సరికొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. గూగుల్ మీట్ లో ‘ఆన్ ది గో’ అనే ఫీచర్‌ను అందించబోతోంది.

ఆన్ ది గో ఎలా పనిచేస్తుంది..

ఇటీవల కాలంలో వీడియో కాల్ మీటింగ్స్ అధికమయ్యాయి. ముఖ్యంగా కరోనా అనంతర పరిణామాల్లో వర్క్ ఫ్రమ్ హోం పెరగడం.. మీటింగ్స్ అన్ని కూడా ఎక్కువగా వీడియో కాల్స్ లోనే జరుగుతున్నాయి. అందుకోసం ఎక్కువ వాతం కంపెనీలు, వ్యక్తులు వినియోగించేది గూగుల్ మీట్. ఈ నేపథ్యంలో వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని గూగుల్ మీట్ ఈ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే ఇది మీ పరిస్థితిని అర్థం చేసుకోవడం ద్వారా మీటింగ్ సెట్టింగ్‌లను ఆటోమేటిక్‌గా మారుస్తుంది. సమావేశంలో చేరిన తర్వాత, దిగువన ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేస్తే దానిని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. మీరు దీన్ని ఆన్ చేసిన వెంటనే, ఇది మీ కోసం మీ వీడియో, ఇతర పాల్గొనేవారి వీడియోను ఆపివేస్తుంది, తద్వారా మీరు మీ శారీరక శ్రమపై దృష్టి కేంద్రీకరించవచ్చు. మీరు నడుస్తున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు మీటింగ్‌లో చేరినట్లయితే, ఈ ఫీచర్ మీ ఫోన్ సెన్సార్‌లను ఉపయోగించి ‘ఆన్ ది గో’ మోడ్‌ను ఆన్ చేయమని కూడా మీకు సూచిస్తుంది. మీకు కావలసినప్పుడు మీరు ఈ మోడ్‌ను ఆఫ్ చేయవచ్చు.

యూఐ మారుతుంది..

మీరు మీట్ లో ‘ఆన్ ది గో’ మోడ్‌ను తెరిచిన వెంటనే మీరు వేరే వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ని పొందుతారు. మ్యూట్, రేజ్ హ్యాండ్, ఆడియో కోసం మీరు సాధారణం కంటే పెద్దగా ఉన్న చిహ్నాలను చూస్తారు. మీకు కావాలంటే, మీరు ఫోన్‌కు బ్లూటూత్ మొదలైనవాటిని కూడా కనెక్ట్ చేయవచ్చు. డెస్క్‌టాప్‌కు దూరంగా మొబైల్‌లో సమావేశాలకు హాజరయ్యే వ్యక్తుల కోసం కంపెనీ ప్రత్యేకంగా ఈ ఫీచర్‌ను తీసుకువస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..