Youtube Vanced App: ఏ చిన్న సమాచారం కావాలన్నా ఇప్పుడు చాలా మంది యూట్యూబ్‌ను (Youtube) ఆశ్రయిస్తున్నారు. వంట గదిలో చేసే చికెన్ కర్రీ నుంచి, బైక్ రిపేర్ వరకు అన్ని విషయాలను యూట్యూబ్‌లో చూసి నేర్చుకునే రోజులు వచ్చేశాయి. ఉచితంగా లక్షల వీడియోలు (Youtube Videos) లభిస్తుండడంతో ఎక్కువ మంది యూట్యూబ్‌కు అట్రాక్ట్ అవుతున్నారు. అయితే మనకు ఉచితంగా కంటెంట్ ఇచ్చే యూట్యూబ్‌కు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్నకు సమాధానం వీడియోల మధ్యలో వచ్చే యాడ్స్. అయితే యాడ్ ఫ్రీగా కంటెంట్ చూడాలనుకునే వారికోసం యూట్యూబ్ పెయిడ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో యూజర్లు ఎలాంటి యాడ్స్ లేకుండా వీడియోలను చూసుకోవచ్చు. అయితే దీనికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
కానీ వాన్సెడ్ అనే యాప్ ఎలాంటి డబ్బులు చెల్లించకుండా యాడ్ ఫ్రీగా వీడియోలు చూసుకునే వెసులు బాటు కలిపించింది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై లభించే ఈ యాప్‌ను ఉపయోగించి యాడ్ ఫ్రీగా యూట్యూబ్ వీడియోలు చూసే అవకాశం ఉండేది. అయితే తాజాగా గూగుల్ వాన్సెడ్ యాప్‌కు గట్టి షాక్ ఇచ్చింది. తమ కంటెంట్‌పై వాన్సెడ్ పెత్తనం ఏంటంటూ న్యాయపరంగా చర్యలకు దిగింది. దీంతో వాన్సెడ్ యాప్‌ని వెనక్కి తీసుకుంది. ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న వారికి త్వరలోనే సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
Vanced has been discontinued. In the coming days, the download links on the website will be taken down. We know this is not something you wanted to hear but it’s something we need to do. Thank you all for supporting us over the years.
— Vanced Official (@YTVanced) March 13, 2022
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. ‘వాన్సెడ్ సేవలను నిలిచిపోయాయి. రానున్న రోజుల్లో డౌన్‌లోడ్ లింక్‌లను తొలగించనున్నాం. ఈ విషయం మీకు నచ్చదని మాకు తెలుసు.. కానీ ఇది మేము చేయక తప్పదు. ఎన్నో ఏళ్లపాటు మాకు మద్ధుతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు.
CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని.. శాస్త్రోక్తంగా మృత్యుంజయ హోమం నిర్వహించిన మంత్రి..