Google pixel 8: లాంచింగ్‌కు సిద్ధమైన గూగుల్ పిక్సెల్ 8 సిరీస్.. ప్రత్యేక ఆకర్షణగా కెమెరా..
గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు టెక్ దిగ్గజం సిద్ధమైంది. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్‌లను అక్టోర్‌లో మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్‌లను విడుదల చేయనున్నారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, ధరలకు సంబంధించి గూగుల్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట...
ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ నుంచి వచ్చి గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్‌లకు మార్కెట్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధునాతన ఫీచర్స్‌తో కూడిన ఈ ఫోన్‌లకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు గూగుల్ పిక్సెల్ సిరీస్‌లో వచ్చిన స్మార్ట్ ఫోన్‌లన్నీ భారీగా అమ్మకాలు జరుపుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా గూగుల్ పిక్సెల్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది.
గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు టెక్ దిగ్గజం సిద్ధమైంది. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్‌లను అక్టోర్‌లో మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్‌లను విడుదల చేయనున్నారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, ధరలకు సంబంధించి గూగుల్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట ఈ సిరీస్‌కు సంబంధించిన ఫీచర్లు, ధరల వివరాలపై ఓ లుక్కేయండి..
గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర విషయానికొస్తే గూగుల్ పిక్సెల్ 8 ధర సుమారు రూ. 52,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక పిక్సెల్ 8 ప్రో ధర రూ. 74,800గా ఉండొచ్చని తెలుస్తోంది. ఇక గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.2 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకురానున్నారు. ఈ డిస్‌ప్లే పీక్‌బ్రైట్నెస్ 2000 నిట్స్ వరకు ఉంటుంది. ఇక పిక్సెల్ 8 ప్రో విషయానికొస్తే ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన ఎల్టీపీఓ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు.
ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్‌లలో గూగుల్ టెన్సార్ జీ3 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఈ ఫోన్‌లో 8జీబీ ఎల్పీడీడీఆర్5 ఎక్స్ ర్యామ్‌ను అందించారు. పిక్సెల్ 8 లో 4574 ఎంఏహెచ్ పవర్ ఫుల్ బ్యాటరీని ఇవ్వనున్నారు. పిక్సెల్ 8ప్రోలో 5050 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు. 30 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 23 వాట్స్ క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను ఇవ్వనున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. హెచ్‌డీఆర్ సామర్థ్యంతో ఈ కెమెరాను తీసుకొచ్చారు. ఈ సెన్సార్ 30 ఎఫ్‌పీఎస్ వద్ద 8కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఇందులో 11 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక గూగుల్ పిక్సెల్ 8ప్రోలో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..