iphone 15: మీరు కొన్న ఐఫోన్‌ 15 ఒరిజినల్‌ కాదనే అనుమానం ఉందా.? ఇలా చెక్ చేసుకోండి..

ఇదిలా ఉంటే ప్రస్తుతం మార్కెట్లో నకిలీ వస్తువులు హడావుడి చేస్తున్నాయి. ముఖ్యంగా నకిలీ గ్యాడ్జెట్స్‌ను అమ్ముతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. మార్కెట్లోకి ఏదైన కొత్త ప్రొడక్ట్ వచ్చిందంటే చాలు దానికి నకిలీ ప్రొడక్ట్‌ ప్రత్యక్షమవుతుంది. నకిలీ ప్రొడక్ట్స్‌ను తయారు చేస్తూ అక్రమార్జన పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఐఫోన్‌ 15కి సంబంధించి నకిలీ ప్రొడక్ట్‌ ఏవైనా మార్కెట్లోకి వస్తే ఎలా గుర్తించాలి.?

iphone 15: మీరు కొన్న ఐఫోన్‌ 15 ఒరిజినల్‌ కాదనే అనుమానం ఉందా.? ఇలా చెక్ చేసుకోండి..
Iphone 15
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 26, 2023 | 8:09 PM

యాపిల్ కంపెనీ నుంచి ఏదైనా గ్యాడ్జెట్‌ లాంచ్‌ అవుతుందంటే ఉండే క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త ఫోన్‌ వస్తుందంటే చాలు ప్రపంచ టెక్‌ మార్కెట్లో సందడిగా ఉంటుంది. ఫోన్‌ లాంచింగ్‌ రోజు వినియోగదారులు క్యూలో నిలబడి మరీ ఫోన్‌లను కొనుగోలు చేస్తుంటారు. అంతలా యాపిల్ ప్రొడక్ట్స్‌కు పేరు ఉంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మార్కెట్లో నకిలీ వస్తువులు హడావుడి చేస్తున్నాయి. ముఖ్యంగా నకిలీ గ్యాడ్జెట్స్‌ను అమ్ముతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. మార్కెట్లోకి ఏదైన కొత్త ప్రొడక్ట్ వచ్చిందంటే చాలు దానికి నకిలీ ప్రొడక్ట్‌ ప్రత్యక్షమవుతుంది. నకిలీ ప్రొడక్ట్స్‌ను తయారు చేస్తూ అక్రమార్జన పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఐఫోన్‌ 15కి సంబంధించి నకిలీ ప్రొడక్ట్‌ ఏవైనా మార్కెట్లోకి వస్తే ఎలా గుర్తించాలి.? మనం కొనుగోలు చేసిన ఐఫోన్‌ 15 నకిలీనా, అసలా తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే..

ఆపిల్‌ కంపెనీ ఈసారి రిటైల్‌ బాక్సులోనే సెక్యూరిటీ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్‌ చేసింది. ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ సెక్యూరిటీ సిస్టమ్‌ ద్వారా మీరు కొనుగోలు చేసిన ఐఫోన్‌ 15 నకిలీయా, ఒరిజినలా తెలుసుకోవచ్చు. యూవీ లైట్‌ను ఫోన్‌ బాక్స్‌పై పెడితే హోలోగ్రామ్‌ దర్శనమిస్తుంది. నకిలీ ఫోన్‌ అయితే ఈ హోలోగ్రామ్‌ కనిపించదు.

మీరు కొనుగోలు చేసిన ఐఫోన్‌ 15 నకిలీ అని అనుమానం వస్తే.. ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అబౌట్ ఫోన్‌పై క్లిక్‌ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఫోన్‌ బాక్స్‌పై ఉండే ఐఎమ్‌ఈఐ నెంబర్‌ను చెక్‌ చేసుకోవచ్చు. అలాగే సిమ్‌ ట్రేలో కూడా ఐఎమ్‌ఈఐ నెంబర్‌ రాసి ఉండడాన్ని గమనించవచ్చు. ఈ పద్ధతుల ద్వారా మీ ఫోన్‌ ఒరిజినలా, నకిలీనా తెలుసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!