Gemini: భారత్‌లో గూగుల్‌ జెమిని యాప్‌ లాంచ్‌.. తెలుగులో కూడా సేవలు..

|

Jun 21, 2024 | 7:35 AM

చాట్‌ జీపీటీకి పోటీగా జెమిని ఏఐ పేరుతో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతేడాది చివరిలో గూగుల్‌ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యంత అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌తో పాటు మరెన్నో అద్భుతమైన ఫీచర్లతో గూగుల్‌ ఈ ఏఐ టూల్‌ను తీసుకొచ్చింది. ఇక అప్పటి నుంచి రకరకాల ఫీచర్లను జోడిస్తూ యూజర్లను అట్రాక్ట్ చేసే...

Gemini: భారత్‌లో గూగుల్‌ జెమిని యాప్‌ లాంచ్‌.. తెలుగులో కూడా సేవలు..
Google Gemini Telugu
Follow us on

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ దాదాపు అన్ని రంగాల్లో అనివార్యంగా మారింది. చాట్‌ జీపీటీ తీసుకొచ్చిన చాట్‌బాట్‌ టెక్నాలజీ రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో ఇంటర్నెట్‌ రంగంలో మొదటి స్థానంలో నిలిచిన గూగుల్ సైతం ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

చాట్‌ జీపీటీకి పోటీగా జెమిని ఏఐ పేరుతో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతేడాది చివరిలో గూగుల్‌ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యంత అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌తో పాటు మరెన్నో అద్భుతమైన ఫీచర్లతో గూగుల్‌ ఈ ఏఐ టూల్‌ను తీసుకొచ్చింది. ఇక అప్పటి నుంచి రకరకాల ఫీచర్లను జోడిస్తూ యూజర్లను అట్రాక్ట్ చేసే పనిలో పడింది గూగుల్‌. ఈ క్రమంలో తాజాగా గూగుల్‌ జెమిని సేవలను భారత్‌లో లాంచ్‌ చేసింది.

గూగుల్ జెమిని పేరుతో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సేవలు తెలుగుతో పాటు మరో 8 భాషల్లో అందుబాటులోకి రావడం విశేషం. ఈ విషయమై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ మాట్లాడుతూ.. ‘జెమినిలో స్థానిక భాషలను జోడించాం. గూగుల్‌ మెసేజెస్‌లో కూడా జెమినీని వినియోగించుకోవచ్చు. రానున్న రోజుల్లో సరికొత్త ఫీచర్లను జోడించనున్నాం’ అని చెప్పుకొచ్చారు. తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, ఉర్దూ భాషల్లోనూ ఈ యాప్ సేవలందిస్తుంది.

ఇక చాట్‌ జీపీటీలో కేవలం ఇంగ్లిష్‌లోనే సమాచారం లభించేది కానీ జెమినీలో మాత్రం మీకు నచ్చిన భాషలో సమాచారాన్ని పొందొచ్చు. టైప్‌ చేయడంతో పాటు, వాయిస్‌ అసిస్టెంట్‌, ఫొటో సహాయంతో కూడా సమాచారాన్ని సెర్చ్‌ చేయొచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను త్వరలోనే ఐఓఎస్‌ యూజర్లకు కూడా తీసుకురానున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..