Layoff: ఉద్యోగుల తొలగింపులు ఇంకెన్ని రోజులు.. సుందర్‌ పిఛాయ్‌ ఏమన్నారంటే

ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇక ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్ సైతం తమ ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యోగుల తొలగింపు ఇంకెన్ని రోజులు ఉంటుందనే సందేహం సహజంగానే వస్తుంది. తాజాగా ఇదే ప్రశ్నను గూగుల్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ సైతం ఎదుర్కొన్నారు. ఇటీవల ఉద్యోగులతో నిర్వహించిన..

Layoff: ఉద్యోగుల తొలగింపులు ఇంకెన్ని రోజులు.. సుందర్‌ పిఛాయ్‌ ఏమన్నారంటే
Layoffs

Updated on: May 11, 2024 | 2:28 PM

కరోనా తదనంతర పరిమాణాల నేపథ్యంలో సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. చిన్న చిన్న స్టార్టప్‌లు మొదలు గూగుల్, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులను ఇంటికి పంపాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం వాతావరణ నేపథ్యంలో ఉద్యోగులను తొలగిస్తూ వచ్చాయి.

ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇక ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్ సైతం తమ ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యోగుల తొలగింపు ఇంకెన్ని రోజులు ఉంటుందనే సందేహం సహజంగానే వస్తుంది. తాజాగా ఇదే ప్రశ్నను గూగుల్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ సైతం ఎదుర్కొన్నారు. ఇటీవల ఉద్యోగులతో నిర్వహించిన ఆల్‌ హ్యాండ్స్‌ మీటింగ్‌లో ఈ ప్రశ్న ఎదురైంది.

ఇంకా ఎన్నాళ్లు ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతాయని ఓ ఉద్యోగి ప్రశ్నించగా దానికి బదులిస్తూ.. ఈ ఏడాది తొలి 6 నెలల పాటు ఈ లేఆఫ్‌లు కొనసాగుతాయని సుందర్‌ పిచాయ్‌ తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోందని తెలిపారు. ఇక తర్వాత 6 నెల్లో కొద్ది సంఖ్యలో తొలగింపులు కొనసాగే అవకాశం ఉందని పిచాయ్‌ అన్నారు. సుందర్ పిచాయ్‌ ఇంకా మాట్లాడుతూ.. కొత్త నియామకాల విషయంలో గూగుల్‌ క్రమశిక్షణతో వ్యవహరించనుందని తెలిపారు.

ఎక్కువ మంది ఉద్యోగులను తీసుకోవడం కంటే మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవడంపై దృష్టి సారించనున్నట్లు చెప్పుకొచ్చారు. భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టకొని ఈ నిర్ణయం తీసుకున్న సుందర్‌ పిచాయ్‌ అన్నారు. ఇక ఉద్యోగుల తొలగింపు వల్ల కంపెనీపై ఉద్యోగుల్లో నమ్మకం తగ్గుతోందని ఓ ఉద్యోగి అడగ్గా సుందర్‌ పింఛాయ్‌ బదులిస్తూ.. గూగుల్‌ అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుందని, ప్రస్తుతం దిద్దుబాటు చర్యలు చేపడుతున్నామని చెప్పుకొచ్చారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..