
ప్రస్తుత రోజుల్లో అందరికీ స్మార్ట్‌ఫోన్ అనేది తప్పనిసరి వస్తువుగా మారింది. అయితే పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆఫర్ల హవా నడుస్తుంది. కాబట్టి ఫోన్ పనితీరు, కెమెరా నాణ్యత, బ్యాటరీ లైఫ్‌ను అందిస్తూ భారతదేశంలో రూ. 15,000లోపు అత్యుత్తమ ఫోన్‌ల గురించి చాలా మంది అన్వేషిస్తూ ఉంటారు. అందువల్ల మీరు సోషల్ మీడియా ఔత్సాహికులైనా, గేమింగ్ ప్రియులైనా లేదా రోజువారీ పనుల కోసం ఆధారపడదగిన స్మార్ట్‌ఫోన్ కావాలన్నా ఈ ఎంపికలు వివిధ అవసరాలను తీరుస్తాయి. ఈ సూపర్ సేల్‌లో రూ.15 వేలలోపు ది బెస్ట్ ఫోన్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
తాజా సేల్‌లో ఈ లావా ఫోన్ మంచి ఆప్షన్‌గా ఉంటుంది. లావా బ్లేజ్ ప్రో ఫోన్ పనితీరు మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. 120 హెచ్‌జెడ్ స్క్రీన్, డైమెన్సిటీ 6020 ఎస్‌ఓసీ, స్టాక్ ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్‌తో ఈ ఫోన్ అద్భుతంగా పని చేస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్ 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో వచ్చే ఈ ఫోన్ రూ. 12,499 ధరతో వస్తుంది.
ఈ ఫోన్ కూడా తాజా సేల్‌లో మంచి ఆప్షన్‌గా ఉంటుంది. ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో వచ్చే ఈ ఫోన్ 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ముఖ్యంగా మీరు గేమ్‌లు ఆడుతున్నప్పుడు లేదా వీడియోలు చూస్తున్నప్పుడు మంచి అనుభవానికి లోనవుతారు. ఈ ఫోన్ ఎక్సినోస్ 1330 చిప్‌సెట్ ద్వారా పని చేస్తుంది. ఈ ఫోన్‌లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో వెనుక కెమెరా వివిధ లైటింగ్ పరిస్థితులలో స్పష్టమైన, రంగురంగుల ఫోటోలను తీయడంలో నిజంగా సౌకర్యంగా ఉంటుంది. ఈ ఫీచర్-ప్యాక్డ్ వన్ యూఐ సాఫ్ట్‌వేర్‌పై కూడా రన్ అవుతుంది.
రెడ్‌మీ 12 5జీ అనేది రెడ్‌మీ ఇటీవల విడుదల చేసిన ఫోన్‌లలో ఒకటి. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.11,999. ఈ ఫోన్ 4 జీబీ+ 128 జీబీ, 6 జీబీ + 128 జీబీ, 8జీబీ+256 జీబీ వేరియంట్స్‌లో రన్ అవుతుంది. ఈ తాజా సేల్‌లో ఈ ఫోన్ కూడా రూ.15 వేల లోపు లభ్యం అవుతుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. వెనుకవైపు క్రిస్టల్ గ్లాస్ డిజైన్‌తో వచ్చే ఈ ఫోన్ వినియోగదారులకు మంచి ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. ఈ రేట్‌లో అందుబాటులో ఉండే ది బెస్ట్ ఫోన్ ఇదేనిని చెప్పవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..