Jio Recharge: జియో ప్రీపెయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. సరికొత్త ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ డేటా

|

Jun 11, 2024 | 2:20 PM

పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా జియో కూడా ఎప్పటికప్పడు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతూ ఉంటుంది. తాజాగా జియో రూ. 296 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా డేటా ప్రయోజనాలతో పాటు అపరిమిత 5 జీ డేటాను కూడా పొందవచ్చు. ఈ నేపథ్యంలో జియో రూ.296 ప్లాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

Jio Recharge: జియో ప్రీపెయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. సరికొత్త ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ డేటా
Jio
Follow us on

భారతదేశంలో ఓ పదేళ్ల నుంచి ఇంటర్నెట్ వినియోగం తారాస్థాయికు చేరింది. మొదట్లో డేటా ధరలు అధికంగా ఉండడంతో కేవలం తక్కువ రీచార్జ్‌లతోనే సగటు వినియోగదారుడు ఇబ్బందిపడేవారు. అయితే టెలికాం రంగంలోకి జియో ఎంట్రీతో మొత్తం సీన్ మారిపోయింది. అన్ని టెలికాం కంపెనీలు జియో బాటలోనే తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలను అందించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే స్పీడ్ పరంగా ఇప్పటికే జియోనే ప్రథమ స్థానంలో ఉండడంతో మొబైల్ వినియోగదారులు జియోనే వాడుతున్నారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా జియో కూడా ఎప్పటికప్పడు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతూ ఉంటుంది. తాజాగా జియో రూ. 296 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా డేటా ప్రయోజనాలతో పాటు అపరిమిత 5 జీ డేటాను కూడా పొందవచ్చు. ఈ నేపథ్యంలో జియో రూ.296 ప్లాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

రిలయన్స్ జియోకు సంబంధించిన రూ. 296 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు 25 జీబీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత 5జీ డేటాను అందించే జియో వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా ఆనందించవచ్చు. అదనపు ప్రయోజనాలు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌కు యాక్సెస్‌ను పొందవచ్చు. అయితే మీకు 5జీ నెట్‌వర్క్ అందుబాటులో లేకపోతే మీరు 4జీ డేటాను ఉపయోగించవచ్చు. అయితే వేగం మాత్రం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్ సర్వీస్ వాలిడిటీ వ్యవధి 30 రోజులుగా ఉంటుంది. 

రిలయన్స్ జియో 15 రూపాయల నుంచి డేటా వోచర్‌లను కూడా అందిస్తుంది. ఇది ఎఫ్‌యూపీ (ఫెయిర్ యూసేజ్ పాలసీ) పరిమితి ముగిసిన తర్వాత అదనంగా 1 జీబీ డేటాను అందిస్తుంది. రిలయన్స్ జియో రూ. 296 ప్లాన్ వినియోగదారులకు రోజుకు సుమారు రూ. 10 ఖర్చవుతుంది. ఇది ఒక నెల పాటు గణనీయమైన మొత్తంలో డేటాతో కనెక్ట్ అయి ఉండటానికి ఇది మంచి ఎంపిక. అయితే మీరు రోజువారీ డేటా ప్లాన్‌లను ఎంచుకుంటే మీరు మరింత తక్కువ ధరకు ఇతర ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ప్లాన్‌లు రూ. 296 ప్లాన్‌లా ఒక రోజులో 10 జీబీ లేదా 15 జీబీని ఉపయోగించుకునే లగ్జరీని అందించవని గుర్తుంచుకోవాలి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి