Best Gaming Laptops: మల్టీటాస్కింగ్‌, గేమింగ్‌ కోసం బెస్ట్‌ ల్యాప్‌ టాప్స్‌ ఇవే.. అమెజాన్‌లో ఏకంగా 35శాతం వరకూ డిస్కౌంట్‌..

|

Feb 13, 2024 | 6:22 AM

మీరు మంచి గేమింగ్‌ ల్యాప్‌ టాప్‌ కొనుగోలు చేయాలను చూస్తున్నారా? టాప్‌ స్పెక్స్‌, హై రేంజ్‌ ఫీచర్లతో పాటు అత్యధిక రిజల్యూషన్‌ ఉన్న ల్యాప్‌ టాప్‌ కోసం వెతుకుతున్నారా? అది కూడా ఏమైనా ఆఫర్లు ఉంటే బాగుండని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. మన ఇండియన్‌ మార్కెట్లో టాప్‌ బ్రాండ్లకు చెందిన బెస్ట్‌ గేమింగ్‌ ల్యాప్‌ టాప్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

Best Gaming Laptops: మల్టీటాస్కింగ్‌, గేమింగ్‌ కోసం బెస్ట్‌ ల్యాప్‌ టాప్స్‌ ఇవే.. అమెజాన్‌లో ఏకంగా 35శాతం వరకూ డిస్కౌంట్‌..
Acer Aspire 5 Gaming Laptop
Follow us on

మీరు మంచి గేమింగ్‌ ల్యాప్‌ టాప్‌ కొనుగోలు చేయాలను చూస్తున్నారా? టాప్‌ స్పెక్స్‌, హై రేంజ్‌ ఫీచర్లతో పాటు అత్యధిక రిజల్యూషన్‌ ఉన్న ల్యాప్‌ టాప్‌ కోసం వెతుకుతున్నారా? అది కూడా ఏమైనా ఆఫర్లు ఉంటే బాగుండని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. మన ఇండియన్‌ మార్కెట్లో టాప్‌ బ్రాండ్లకు చెందిన బెస్ట్‌ గేమింగ్‌ ల్యాప్‌ టాప్‌లను మీకు పరిచయం చేస్తున్నాం. ఆయా ల్యాప్‌ టాప్‌ లపై ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ ఫారం అమెజాన్‌లో అదిరే ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. దాదాపు 35శాతం వరకూ తగ్గింపు పొందొచ్చు. అసుస్‌, ఎంఎస్‌ఐ, యాసర్‌ వంటి బ్రాండ్లు ఇందులో ఉన్నాయి. అధిక-పనితీరు గల ప్రాసెసర్‌లు, గ్రాఫిక్స్ కార్డ్‌లు, లీనమయ్యే డిస్‌ప్లేలతో కూడిన శక్తివంతమైన మెషీన్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.

ఏసర్‌ ఆస్పైర్‌ 5 గేమింగ్‌ ల్యాప్‌టాప్‌..

ఇది ఇంటెల్ కోర్ ఐ5 12వ జెన్ ప్రాసెసర్‌తో వస్తుంది. 15.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. 16జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్‌ కలిగి ఉంటుంది. విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేస్తుంది.4జీబీ డెడికేటెడ్‌ గ్రాఫిక్స్ కార్డ్, ఆర్టీఎక్స్‌ 2050 ఉంటుంది. ఇది సున్నితమైన గేమింగ్ అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తుంది. అమెజాన్ సేల్ ఈల్యాప్‌ టాప్‌పై 34% తగ్గింపుతో వస్తుంది. దీని అసలు ధర రూ. 54,990 కాగా.. ఆఫర్‌ పై దీని కేవలం రూ. 84,999కే సొంతం చేసుకోవచ్చు.

హెచ్‌పీ విక్టస్‌ గేమింగ్ ల్యాప్‌టాప్..

దీనిలో 12వ తరం ఇంటెల్ కోర్ ఐ5-12450హెచ్‌ ప్రాసెసర్ ఉంటుంది. 16జీబీ ర్యామ్‌, 512జీబీ ఎస్‌ఎస్‌డీని కలిగి ఉంటుంది. దీనిలో ఎన్‌వీఐడీఐఏ జీఈఫోర్స్‌ ఆర్టీఎక్స్‌3050 గ్రాఫిక్స్‌ కార్డు ఉంటుంది. 144హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ తోకూడిన ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ ప్లేతో వస్తుంది. అమెజాన్ సేల్‌లో ఈ ల్యాప్‌టాప్‌పై 23% తగ్గింపు పొందొచ్చు. దీని అసలు ధర రూ. 88,646కాగా.. ఆఫర్‌లో రూ. 67,999కి కొనుగోలు చేయొచ్చు.

ఇవి కూడా చదవండి

అసుస్‌ టీయూఎఫ్‌ గేమింగ్‌ ఎఫ్‌15 గేమింగ్‌ ల్యాప్‌టాప్‌..

దీనిలో కూడా ఇంటెల్ కోర్ ఐ5-11400 హెచ్‌ 11వ జెన్ ప్రాసెసర్ ఉంటుంది. 16జీబీ ర్యామ్‌, 512జీబీ ఎస్‌ఎస్‌డీ కార్డును కలిగి ఉంటుంది. 15.6-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ 144హెర్జ్‌ డిస్ప్లే ఉంటుంది. అలాగే 4జీబీ ఎన్‌విడియా జీఈఫోర్స్‌ ఆర్టీఎక్స్‌ 2050 గ్రాఫిక్స్‌ కార్డు ఉంటుంది. ఆర్‌జీబీ బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ వస్తుంది. దీనిపై అమెజాన్‌లో 35శాతం తగ్గింపు లభిస్తోంది. అసలు ధర రూ. 80,990 కాగా.. రూ. 52,990కే కొనుగోలు చేయొచ్చు.

డెల్‌ జీ15 5520 గేమింగ్‌ ల్యాప్‌టాప్‌..

ఇది ఇంటెల్‌ ఐ5-12500హెచ్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 16జీబీ ర్యామ్‌, Iటీబీ ఎస్‌ఎస్‌డీని కలిగి ఉంటుంది. 120హెర్జ్‌ రిఫ్రెష్ రేట్ కలిగిన 15.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ ప్లే ఉంటుంది. ఎన్‌విడియా ఆర్టీఎక్స్‌ 3050 గ్రాఫిక్స్‌ కార్డ్‌ ఉంటుంది. విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేస్తుంది. దీనిపై 21శాతం తగ్గింపు ఉంటుంది. అసలు ధర రూ. 97,115కాగా.. రూ. 76,490కి కొనుగోలు చేయొచ్చు.

ఎంఎస్‌ఐ స్వోర్డ్‌ 15 ఏ12వీఎఫ్‌ గేమింగ్‌ ల్యాప్‌ టాప్‌..

ఇది ఇంటెల్ 12వ జనరల్ 17-12650హెచ్‌ ప్రాసెసర్‌తో వస్తుంది. 16జీబీ ర్యామ్‌, Iటీబీ ఎస్‌ఎస్‌డీ ఉంటుంది. 40సెంటీమీటర్స్‌ ఫుల్‌ హెచ్‌డీ 144హెర్జ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఎన్‌విడియా జీఫోర్స్‌ ఆర్టీఎక్స్‌ 4050 గ్రాఫిక్స్ కార్డ్‌తో 6జీబీ జీడీడీఆర్‌6 మెమరీని అందిస్తుంది. విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తో వస్తుంది. దీనిపై అమెజాన్‌లో 27శాతం తగ్గింపు ఉంది. అసలు ధర రూ. 1,34,990కాగా ఆఫర్‌లో రూ. 97,990కే కొనుగోలు చేయొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..