AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: మొబైల్ నెంబర్ కనిపించకుండానే వాట్సప్‌లో ఇతరులతో చాట్ చేయొచ్చు.. ఎలానో చూడండి..

ప్రస్తుత కాలంలో ప్రతీఒక్కరూ వాట్సప్ అనేది వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరి ఫోన్లలో ఈ యాప్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా తాజాగా మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.

WhatsApp: మొబైల్ నెంబర్ కనిపించకుండానే వాట్సప్‌లో ఇతరులతో చాట్ చేయొచ్చు.. ఎలానో చూడండి..
Whatsapp Feature
Venkatrao Lella
|

Updated on: Jun 13, 2026 | 4:53 PM

Share

వాట్సప్ వాడేవారికి గుడ్ న్యూస్. మోటా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేంటంటే.. మీ మొబైల్ నెంబర్ కనిపించకుండానే ఇతరులతో ఛాట్ చేయవచ్చు. అదెలా అనుకుంటున్నారా.. యూజర్ నేమ్ సాయంతో మీరు ఇతరులతో చాట్ చేయవచ్చు. మీ మొబైల్ నెంబర్ అనేది వారికి కనిపించదు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రాం లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో యూజర్ నేమ్ ఆధారంగా వ్యక్తిని గుర్తు పట్టి ఛాటింగ్ చేస్తున్నారు. అచ్చం అలాంటి ఫీచర్ ఇప్పుడు వాట్సప్‌లో కూడా వచ్చేసింది. దీని వల్ల మీ మొబైల్ నెంబర్‌ ఇతరులకు తెలిసే అవకాశం ఉండదు. దీని వల్ల మీ వ్యక్తిగత సమాచారం ఇతరులకు తెలిసే ఉండదు. ఇటీవల మొబైల్ నెంబర్ ఆధారంగా సైబర్ నేరాలు జరుగుతున్న క్రమంలో వాట్సప్ ఈ ఫీచర్ తీసుకొచ్చింది.

బీటా యూజర్లకు అందుబాటులోకి..

ప్రస్తుతం బీటా యూజర్లతో పాటు కొంతమంది యూజర్లకు మాత్రమే వాట్సప్ ఈ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. రానున్న రోజుల్లో వాట్సప్ యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు మనం ఎవరినైనా వాట్సప్‌లో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా మిమ్మల్ని ఇతరులు కాంటాక్ట్ అవ్వాలన్నా మొబైల్ నెంబర్ అనేది అవసరం. అయితే ఇక నుంచి యూజర్ నేమ్ సాయంతో మీరు వాట్సప్‌లో ఇతరులతో ఛాట్ చేయవచ్చు. అలాగే మీ యూజర్ నేమ్ సాయంతో ఇతరులు మిమ్మల్ని వాట్సప్‌లో సంప్రదించగలుగుతారు.

యూజర్ నేమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి..?

-మీ మొబైల్‌లో వాట్సప్ తెరవండి

-సెట్టింగ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-ప్రొఫైల్ నేమ్‌పై క్లిక్ చేయండి

-అనంతరం పేరుపై క్లిక్ చేసి అకౌంట్ వివరాలు యాక్సెస్ చేయండి

-అక్కడ మోనూ నుంచి యూజర్ నేమ్ ఆప్షన్ ఎంచుకోండి

-మీ యూజర్ నేమ్ సెట్ చేసుకోండి

-యూజర్ నేమ్ 3 నుంచి 35 క్యారెక్టర్స్ మధ్య ఉండేలా సెట్ చేసుకోవాలి

-ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక అక్షరం ఖచ్చితంగా యూజర్ నేమ్‌లో ఉండాలి

-మీరు ఎంచుకున్న యూజర్ నేమ్ అందుబాటులో ఉందో.. లేదో వాట్సప్ పరిశీలిస్తుంది

-అందుబాటులో ఉన్నట్లయితే మీరు సేవ్ లేదా డన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది

సైబర్ నేరాలకు చెక్

ఇటీవల సైబర్ నేరాలు అనేవి పెరిగిపోతున్నాయి. వాట్సప్ నెంబర్లు సేకరించి స్పామ్ లింకుల ద్వారా అకౌంట్లలోని డబ్బలును కొల్లగొడుతున్నారు అక్రమార్కులు. దీంతో యూజర్ల భద్రత కోసం వాట్సప్ ఈ ఫీచర్ తీసుకొచ్చింది. దీని వల్ల యూజర్ల మొబైల్ నెంబర్ అనేది ఇతరులకు తెలియదు. దీని వల్ల సైబర్ నేరాలకు కాస్త అడ్డుకట్ట వేసినట్లు ఉంటుంది.

Follow Us