ట్రాఫిక్‌ చలాన్లు చెల్లించడంలో ఇబ్బందులా.? పేటీఎమ్‌తో ఇలా సింపుల్‌గా..

వాహనదారులు కూడా తమకు వచ్చిన మెసేజ్‌ను చెక్‌ చేసుకొని, ఈ చాలన్‌ వెబ్‌సైట్‌ లేదా మీ సేవలాంటి వాటి ద్వారా చలాన్లను చెల్లిస్తుంటారు. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం చలాన్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి వరకు ఉన్న పెండింగ్ చలాన్లపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటించాయి. దీంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెండింగ్ చలాన్లను చెల్లిస్తున్నారు. ఈ కారణంగా వెబ్‌సైట్‌ హ్యాంగ్‌ అయిన సందర్భాలు...

ట్రాఫిక్‌ చలాన్లు చెల్లించడంలో ఇబ్బందులా.? పేటీఎమ్‌తో ఇలా సింపుల్‌గా..
Paytm

Updated on: Dec 29, 2023 | 6:31 PM

ఒకప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించే వారికి పోలీసులు చలాన్లు రాసి అక్కడికక్కడే చలాన్లను విధించి డబ్బులు వసూలు చేసి రిసిప్ట్ ఇచ్చేవారు. అయితే మారుతోన్న టెక్నాలజీతో పాటు ట్రాఫిక్‌ చలాన్ల విధింపుల్లోనూ మార్పులు వచ్చాయి. సీసీ టీవీ కెమెరాల ఆధారంగా ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారికి నేరుగా మెసేజ్‌ రూపంలో చలాన్‌ మొత్తాన్ని పంపిస్తున్నారు.

వాహనదారులు కూడా తమకు వచ్చిన మెసేజ్‌ను చెక్‌ చేసుకొని, ఈ చాలన్‌ వెబ్‌సైట్‌ లేదా మీ సేవలాంటి వాటి ద్వారా చలాన్లను చెల్లిస్తుంటారు. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం చలాన్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి వరకు ఉన్న పెండింగ్ చలాన్లపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటించాయి. దీంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెండింగ్ చలాన్లను చెల్లిస్తున్నారు. ఈ కారణంగా వెబ్‌సైట్‌ హ్యాంగ్‌ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ ఆన్‌లైన్‌ చలాన్లను సింపుల్‌గా చెల్లించే మార్గాలు కూడా ఉన్నాయి. వీటిలో ఒకటి పేటీఎం యాప్‌ ఒకటి. ఆన్‌లైన్‌ పేమెంట్‌ యాప్‌ పేటీఎం ద్వారా చాలా సులభంగా ఈ చలాన్లను చెల్లించే అవకాశం ఉంది. కొన్ని సింపుల్ స్టెప్స్‌ ద్వారా పేటీఎమ్‌లో పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చు. ఇందుకోసం ముందుగా స్మార్ట్‌ ఫోన్‌లో పేటీఎం యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం లాగిన్ అయిన తర్వాత.. రీఛార్జ్‌ అండ్‌ పే బిల్స్‌పై క్లిక్‌ చేయాలి.

అనంతరం అందులో ఉండే చలాన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత ట్రాఫిక్‌ అథారిటీ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం తెలంగాణ ట్రాఫిక్‌ పోలీస్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. తర్వాత వాహనం నెంబర్‌ ఎంటర్ చేసి ప్రొసీడ్ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే మీ వాహనంపైన ఉన్న పెండింగ్ చలాన్లు కనిపిస్తాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, పేటీఎం వ్యాలెట్, పేటీఎం పోస్ట్‌పెయిడ్, యూపీఐ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా పెండింగ్ చలాన్లు చెల్లించవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..