iphone 14 plus: ఐఫోన్‌ కొనలానుకుంటున్నారా.? రూ. 20వేల డిస్కౌంట్‌, ఈ ఆఫర్‌ మళ్లీ రాదు..

|

May 26, 2024 | 1:19 PM

యాపిల్‌ సంస్థకు చెందిన ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయాలని చాలా మంది ఆశిస్తుంటారు. ముఖ్యంగా ఐఫోన్‌ కొనాలనేది చాలా మంది డ్రీమ్‌. అయితే ఐఫోన్‌ ధరలకు భయపడి వెనుకడుగు వేస్తుంటారు. అయితే మీలాంటి వారి కోసమే ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ భారీ డీల్‌ను అందిస్తోంది. ఐఫోన్‌ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది...

iphone 14 plus: ఐఫోన్‌ కొనలానుకుంటున్నారా.? రూ. 20వేల డిస్కౌంట్‌, ఈ ఆఫర్‌ మళ్లీ రాదు..
Iphone 14 Plus
Follow us on

యాపిల్‌ సంస్థకు చెందిన ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయాలని చాలా మంది ఆశిస్తుంటారు. ముఖ్యంగా ఐఫోన్‌ కొనాలనేది చాలా మంది డ్రీమ్‌. అయితే ఐఫోన్‌ ధరలకు భయపడి వెనుకడుగు వేస్తుంటారు. అయితే మీలాంటి వారి కోసమే ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ భారీ డీల్‌ను అందిస్తోంది. ఐఫోన్‌ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. మంత్‌ ఎండ్‌ మొబైల్ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తారు.

యాపిల్‌ ఐఫోన్‌ 14 ప్లస్‌ 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర రూ. 58,999కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా 26 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 58,999కి సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే ఈ ఫోన్‌పై అదనంగా రూ. 1000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 57,999కి పొందొచ్చు. ఇక మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా కూడా డిస్కౌంట్ పొందొచ్చు. మీ పోన్‌ కండిషన్‌ ఆధారంగా గరిష్టంగా రూ. 55,500 డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఐఫోన్ 14 ప్లస్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో.. 6.7 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌లో ఏ15 బయోనిక్‌ చిప్‌6 కోర్‌ ప్రాసెసర్‌ను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే 12+12 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాసెటప్‌ను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఈ ఫోన్‌ను మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్, రెడ్, బ్లూ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ iOS 16తో వస్తుంది. ఇందులో 15 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4323 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అఆలగే డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ కోసం ఇందులో ఐపీ68 రేటింగ్‌ను ఇచ్చారు. కనెక్టివిటీ కోసం, iPhone 14 Plus Wi-Fi 802.11 AX, GPS వంటి ఫీచర్లను అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..