Realme C11: రూ. 9 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ రూ. 99కే.. రియ‌ల్‌మీ సీ11పై అదిరిపోయే ఆఫ‌ర్‌..

Realme C11: ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఎల‌క్ట్రానిక్స్ సేల్స్ నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా ప‌లు ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్ల‌పై అదిరిపోయే ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. జ‌న‌వరి 27న ప్రారంభమైన ఈ సేల్ 31వ తేదీ వ‌ర‌కు కొనసాగ‌నుంది. ఇక ఈ సేల్‌లో భాగంగా..

Realme C11: రూ. 9 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ రూ. 99కే.. రియ‌ల్‌మీ సీ11పై అదిరిపోయే ఆఫ‌ర్‌..

Updated on: Jan 29, 2022 | 11:17 AM

Realme C11: ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఎల‌క్ట్రానిక్స్ సేల్స్ నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా ప‌లు ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్ల‌పై అదిరిపోయే ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. జ‌న‌వరి 27న ప్రారంభమైన ఈ సేల్ 31వ తేదీ వ‌ర‌కు కొనసాగ‌నుంది. ఇక ఈ సేల్‌లో భాగంగా వినియోగ‌దారుల‌కు అదిరిపోయే ఆఫ‌ర్‌ను అందించించి ఫ్లిప్‌కార్ట్‌. రూ. 8,999 విలువ చేసే రియ‌ల్ మీ సీ11 స్మార్ట్‌ఫోన్‌ను కేవ‌లం రూ. 99కే సొంతం చేసుకునే అవ‌కాశం క‌లిపించింది. అంత త‌క్కువ ధ‌ర‌కు ఎలా వ‌స్తుంద‌నేగా మీ సందేహం. అయితే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే..

రియ‌ల్‌మీ సీ11 అస‌లు ధ‌ర రూ. 8,999కి అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 5శాతం క్యాష్‌బాక్ అందిస్తుంది. అంటే ఈ ఫోన్ రూ. 8,549కే అందుబాటులోకి రానుంద‌న్న‌మాట‌. ఇక పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా ఏకంగా రూ. 8,450 వ‌ర‌కు త‌గ్గింపు పొందొచ్చు. ఈ లెక్క‌న రియ‌ల్‌మీ సీ11 కేవ‌లం రూ. 99కే సొంతం చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌. మ‌రెందుకు ఆల‌స్యం మీ పాత ఫోన్‌ను ఇచ్చేసి రూ. 9 వేల ఫోన్‌ను కేవ‌లం రూ. 99కే సొంతం చేసుకోండి.

రియ‌ల్ మీ సీ11 ఫీచ‌ర్లు..

* ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్ మినీ డ్రాప్ ఫుల్ స్క్రీన్‌ను అందించారు.

* ఇక స్టోరేజ్ విష‌యానికొస్తే ఇందులో 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంది.

* 5000 ఎమ్ఏహెచ్ బ్యాట‌రీ ఈ స్మార్ట్ ఫోన్ సొంతం.

* కెమెరా విష‌యానికొస్తే ఇందులో 8 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

Also Read: Dog birthday video: గ్రాండ్‌గా కుక్క బర్త్‌ డే పార్టీ.. ముగ్గరు అరెస్ట్‌.. ఎందుకో తెలుసా.? వైరల్ అవుతున్న వీడియో..

Color Identify: పురుషుల కంటే మహిళలే ఎక్కువ రంగులను గుర్తిస్తారట.. పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడి..!

Google-Airtel: గూగుల్‌ కీలక నిర్ణయం.. టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌తో మరో భారీ ఒప్పందం..!