Smartphone: ఫ్లిప్‌కార్ట్‌లో మరో సేల్‌.. ఈ స్మార్ట్‌ఫోన్స్‌పై ఊహకందని డిస్కౌంట్స్‌..

|

Oct 10, 2024 | 7:40 PM

Flipkart big shopping Utsav: ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మొన్నటి వరకు బిగ్‌ బిలియన్‌ డేస్‌తో యూజర్లను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా బిగ్‌ షాపింగ్ ఉత్సవ్‌ పేరుతో మరో కొత్త సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. ఇంతకీ ఏంటా స్మార్ట్ ఫోన్స్‌.? ఎలాంటి డిస్కౌంట్ లభిస్తోందో...

Smartphone: ఫ్లిప్‌కార్ట్‌లో మరో సేల్‌.. ఈ స్మార్ట్‌ఫోన్స్‌పై ఊహకందని డిస్కౌంట్స్‌..
Motorola G85 5g
Follow us on

Flipkart big shopping Utsav: ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మొన్నటి వరకు బిగ్‌ బిలియన్‌ డేస్‌తో యూజర్లను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా బిగ్‌ షాపింగ్ ఉత్సవ్‌ పేరుతో మరో కొత్త సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. ఇంతకీ ఏంటా స్మార్ట్ ఫోన్స్‌.? ఎలాంటి డిస్కౌంట్ లభిస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం..

Motorola G85 5G: ఈ సేల్‌లో లభిస్తోన్న బెస్ట్ డీల్స్‌లో ఇదీ ఒకటి. ఈ ఫోన్‌ను సేల్‌లో భాగంగా రూ. 15,999కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 3డీ పీఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. అలాగే కెమెరా విషయానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు.

Realme P1 5G: రియల్‌మీ స్మార్ట్‌ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా రూ. 12,999కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్‌తో అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Nothing Phone 2A: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా నథింగ్ ఫోన్‌2ఏ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌ను రూ. 20,999కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో నోటిఫికేషన్ ఇండికేటర్‌గా పనిచేసే, గ్లిఫ్‌ లైట్ను అందించారు. అలాగే మంచి నాణ్యతతో కూడిన కెమెరాను ఇందులో అందించారు.

Samsung Galaxy S23 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 39,999కి సొంతం చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పించింది. ఈ ఫోన్‌ ఏఐ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Poco M6 5G: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్ల కోసం చూస్తున్న వారికి పోకో ఎమ్‌6 బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను కేవలం రూ. 7200కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..