ప్రస్తుతం యువత ఎక్కువగా స్మార్ట్ యాక్ససరీస్‌ను విపరీతంగా వాడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌లను ఎక్కువమంది వాడుతున్నారు. గతంలో వాచ్‌లు అంటే కేవలం టైం చూసుకోడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల రాకతో అన్ని రకాల సేవలు వాటిలోనే వస్తున్నాయి. ముఖ్యంగా బ్లూ టూత్ కాలింగ్, హార్ట్ బీట్ ట్రాకింగ్, ఎస్‌పీ 2 రేట్ వంటి ఫీచర్లతో స్మార్ట్ వాచ్‌లు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ వాచ్‌లను ప్రవేశపెడుతున్నాయి. ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ ఫైర్-బోల్ట్ భారతీయ మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఫైర్-బోల్ట్ లెగసీ పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్ లూక్స్ సేకరణకు సరికొత్త జోడింపుగా ఉంటుంది. స్టైలిష్ బెల్టులతో పాటు రొటేటింగ్ డయల్‌తో వచ్చే ఈ వాచ్ స్టెయిన్‌లెస్-స్టీల్ డిజైన్‌తో వస్తుంది. అలాగే ఈ వాచ్‌లో రెండు బటన్ పషర్‌లను కూడా వస్తాయి. లెగసీ స్మార్ట్ వాచ్ 1.43 అంగుళాల ఎమో ఎల్ఈడీ డిస్‌ప్లేతో 466 x 466 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తాయి. ఈ వాచ్ గరిష్టంగా 600 నిట్‌ల ప్రకాశవంతంగా పని చేస్తుంది. అలాగే 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ వాచ్ ముఖ్యంగా యాంటీ రస్ట్ లక్షణాలతో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు, వాయిస్ అసిస్టెన్స్ IP68 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లతో ఈ వాచ్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ స్మార్ట్‌వాచ్‌ను వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయవచ్చు. ఈ వాచ్‌లో వచ్చే 330 ఎంఏహెచ్ బ్యాటరీతో ఓ సారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు పని చేస్తుంది. అలాగే ఈ స్మార్ట్ వాచ్ స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన సమాచారాన్ని నిజ సమయంలో అందిస్తుంది. నవీకరణలను స్వయంచాలకంగా అందించడానికి మీరు సహచర యాప్‌కు మీకు ఇష్టమైన స్టాక్‌లను జోడించవచ్చు. లెగసీ స్మార్ట్‌వాచ్‌లో లెదర్ పట్టీలు ఉంటాయి. అలాగే బ్లూటూత్ 5.1కి మద్దతు ఇస్తుంది. ఫైర్-బోల్ట్ హెల్త్ సూట్ ద్వా నిద్ర పర్యవేక్షణ, ఎస్‌పీఓ 2, హృదయ స్పందన రేట్లను తెలుసుకునే అవకాశం ఇస్తుంది. హెల్త్ వెల్‌నెస్ రిమైండర్, కాలిక్యులేటర్, ఫైండ్ మై ఫోన్ వంటి అదనపు ఫీచర్లు ఈ వాచ్ ప్రత్యేకం. ఇండియా ఈ వాచ్ భారతదేశంలో మార్చి 25 నుంచి అందుబాటులో ఉంటుంది. అలాగే దీని ధర రూ.3,999గా నిర్ణయించారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం