Whatsapp DP Check: మీ వాట్సప్ డీపీని ఎవరెవరు చూసారో తెలుసుకోవాలని ఆసక్తి ఉందా.. అయితే ఇలా చేస్తే సరి..

Surya Kala

Surya Kala |

Updated on: Sep 15, 2021 | 9:15 AM

Whatsapp DP Check: ఇప్పుడు ప్రపంచంలో అన్నం లేనివాడైనా ఉంటున్నాడు కానీ చేతిలో స్మార్ట్ ఫోన్ లేని వారు ఉండడం లేదు అంటే అతిశయోక్తికాదు. అంతగా స్మార్ట్ ఫోన్, డేటా మన జీవితంలో స్థానం సంపాదించుకుంది..

Whatsapp DP Check: మీ వాట్సప్ డీపీని ఎవరెవరు చూసారో తెలుసుకోవాలని ఆసక్తి ఉందా.. అయితే ఇలా చేస్తే సరి..
Watsup Display
Follow us

Whatsapp DP Check: ఇప్పుడు ప్రపంచంలో అన్నం లేనివాడైనా ఉంటున్నాడు కానీ చేతిలో స్మార్ట్ ఫోన్ లేని వారు ఉండడం లేదు అంటే అతిశయోక్తికాదు. అంతగా స్మార్ట్ ఫోన్, డేటా మన జీవితంలో స్థానం సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాతో పాటు వాట్స్ యాప్ కూడా స్మార్ట్ ఫోన్ లో ఉండాల్సిందే.. ఇక ఈ వాట్స్ యాప్ ని ఉపయోగించడానికి కేవలం ఒక ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు.  ఉచితంగా సందేశాలు పంపుకోవచ్చు. వీడియోల్ని , ఆడియో ఫైల్స్‌ను కూడా క్షణాల్లో కోరుకున్న వారికి పంపచ్చు.  దీంతో వాట్స్ యాప్ లేని స్మార్ట్‌ఫోన్ లేదంటే అతిశయోక్తి కానే కాదు.

ఇన్‌స్టంట్ మెసేజింగ్ సేవలకు సంబంధించి ఇదో అప్లికేషన్.. యాప్.. దీనిద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారులు చాలా సులువుగా టెక్స్ట్, వాయిస్ మెసేజ్‌లతో పాటు వీడియోలు, ఫోటోలు ఏవైనా సరే వేరొకరికి లేదా గ్రూపునకు పంపొచ్చు. వేరొకరు పంపిన వీడియోలు, ఫోటోలు, మెసేజ్‌లు ఇతరులతో పంచుకోవచ్చు. అయితే ఈ వాట్సాప్ ఉన్న ప్రతి ఒక్కరూ తమ వాట్సాప్ డిస్ప్లే పిక్చర్ గా ఇదొక ఫోటోని పెడుతూనే ఉంటారు. ఈ ఫొటోలతో తమ ఫీలింగ్ ను వ్యక్తపరుస్తుంటారు. అయితే మన వాట్సాట్ డిస్ప్లేని, స్టేటస్ ని ఎవరు చూశారో తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ ఉంటుంది. అయితే స్టేటస్ ఎవరెవరు చూశారో ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ అదే వాట్సప్ డిస్ప్లే ని  ఎవరెవరు చుశారో తెలుసుకోవడం కొంచెం కష్టం.. దీనికి కూడా ఒక చిన్న యాప్ అందుబాటులోకి వచ్చింది. దానిని డౌన్ లోడ్ చేసుకుంటే.. మీ డీపీ ని ఎవరు చూశారో ఈజీగా తెలుసుకోవచ్చు..  దీనికి మీరుచేయాల్సిందల్లా..

మీ Whatsapp DP ఫోటో చూశారో తెలుసుకోవడానికి ఒక ఆండ్రాయిడ్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవలసి వుంటుంది. దీనికి రెండు యాప్ లు అందుబాటులో ఉన్నాయి. Who Viewed My Whatsapp Profile లేదా Whats Track యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ Google play Store నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  వీటిల్లో ఏదైనా ఒకదానిని ఎంచుకుని ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసిన తరువాత రన్ చెయ్యడానికి కొంత సమయం పడుతుంది. ఈ టైమ్ లో మీ వాట్సాప్ కాంటాక్ట్స్ నుండి మీ ప్రొఫైల్ లేదా డిస్ప్లే పిక్చర్(DP) ని ఎవరెవరు చూశారనే వివరాలను సేకరిస్తుంది. తరువాత, ఈ యాప్ లో మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను చూసిన స్నేహితుల లేదా ఇతరుల మొబైల్ నెంబర్లు ,  పేర్లను కూడా తెలియజేస్తుంది. అయితే, ఈ యాప్ కేవలం 24 గంటల లోపులో ఎవరెవరు మీ వాట్సాప్ ప్రొఫైల్ చూశారనే వివరాలను మాత్రమే ఇస్తుంది.

Also Read: Hyderabad Crime News: కిడ్నాప్​కు గురైన ఆరేళ్ల బాలికను 24 గంటల్లోనే తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించిన పోలీసులు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Click on your DTH Provider to Add TV9 Telugu