AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఇంటర్నెట్‌ తెగ వాడేస్తున్నారా?.. జాగ్రత్త ఇంట్లో స్పైను పెట్టుకున్నట్టే!

ఇటీవలే వెలువడి ఓ కొత్త పరిశోధన ప్రకారం, ఇళ్లలో ఉపయోగించే ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ కేబుల్స్ ద్వారా శబ్దాలను రికార్డ్ చేయవచ్చని తెలుస్తోంది. గాలిలోని శబ్దాల వల్ల కేబుల్‌లో వచ్చే సూక్ష్మ కంపనాలను గుర్తించి, వాటిని ఆడియోగా మార్చడం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇది మన ప్రైవసీకి తీవ్రమైన ముప్పుని వారు చెబుతున్నారు. ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Viral News: ఇంటర్నెట్‌ తెగ వాడేస్తున్నారా?.. జాగ్రత్త ఇంట్లో స్పైను పెట్టుకున్నట్టే!
Fiber Optic Eavesdropping
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Apr 09, 2026 | 5:27 PM

Share

ఇంటర్నెట్ సురక్షితమైనది చాలా మంది అనుకుంటాం. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోది కచ్చితంగా మీ  ఆలోచన మారుస్తోంది. మన ఇళ్లలో ఉండే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌నే కొందరు వినికిడి పరికరాల్లా ఉపయోగింకుంటున్నారని కొత్త రీసెర్చ్ చెబుతోంది. సాధారణంగా ఈ కేబుల్స్ కాంతి ద్వారా డేటాను పంపిస్తాయి కాబట్టి, ఇవి సురక్షితం అనుకుంటారు అందరూ. కానీ గాలిలో వచ్చే శబ్దం కేబుల్‌ను తాకినప్పుడు, చాలా చిన్న స్థాయిలో కంపనలు వస్తాయి. ఆ కంపనాలు కేబుల్‌లో వెళ్లే కాంతిపై ప్రభావం చూపుతాయి. ఈ మార్పులను ప్రత్యేక పరికరాలతో గుర్తించి మళ్లీ శబ్దంగా మార్చవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కొన్ని ప్రత్యేక సెట్టింగ్స్‌ ద్వారా ఈ శబ్ధాలను మరింత స్పష్టం వినవచ్చట. కొంత పొడవైన కేబుల్‌ను చుట్టి ఇంటర్నెట్ బాక్స్‌లో దాచితే, అది శబ్దాన్ని ఇంకా బాగా పట్టుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మాట్లాడిన మాటలను రికార్డ్ చేయడం కూడా సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఇలా రికార్డ్ చేసిన ఆడియోను AI సహాయంతో విశ్లేషిస్తే మనం మాట్లాడిన ప్రతి విషయం క్లారిటీ వినిపిస్తుందని చెబుతున్నారు.

ఇది కేవలం మాటలకే పరిమితం కాదు. ఇంట్లో జరిగే చిన్న చిన్న శబ్దాలు కూడా గుర్తించవచ్చు. ఉదాహరణకు అడుగుల శబ్దం, టైపింగ్ శబ్దం, వాషింగ్ మెషిన్ శబ్దం లాంటివి కూడా పట్టుకోవచ్చు. అంతేకాకుండా, గదిలో ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా అంచనా వేయవచ్చట. ఇందులో ప్రధానంగా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే దీన్ని సులభంగా గుర్తించలేము. సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించే పరికరాలతో ఈ రకమైన గూఢచర్యాన్ని గుర్తించడం కష్టం.

ఎందుకంటే ఇది నిశ్శబ్దంగా, ఎవరికీ తెలియకుండా పని చేస్తుంది. అయితే, ఇది కేవలం కేబుల్‌కు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుందట. అందుకే దీని వల్ల వెంటనే ప్రమాదం లేదని చెబుతున్నారు. కానీ ఎక్కువ భద్రత అవసరమైన ప్రదేశాల్లో మాత్రం ఇది సమస్యగా మారే అవకాశం ఉందంటున్నారు. దీనిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోచ్చని చెబుతున్నారు.

ఇంట్లో కేబుల్స్‌ను సరిగ్గా అమర్చడం, అవసరానికి మించిన వైర్లను తగ్గించడం, గదుల్లో సౌండ్ ప్రూఫింగ్ చేయడం, అలాగే ప్రత్యేక రక్షణ పరికరాలను ఉపయోగించడం వల్ల ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. మొత్తానికి, మనకు వేగంగా ఇంటర్నెట్ ఇస్తున్న ఈ టెక్నాలజీ.. మన ప్రైవసీకి కూడా ఒక సవాల్‌గా మారే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us