ఈ రోజుల్లో నకిలీ అనేది ఏరులై పారుతోంది. ప్రతిది కూడా నకిలీ వచ్చేస్తోంది. అమాయక ప్రజల ఆసరాగా చేసుకుంటున్న కేటుగాళ్లు.. రకరకాల నకిలీ వస్తువులను మార్కెట్లోకి తీసుకొచ్చి భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీని అరికట్టేందుకు పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా నకిలీ అల్లం కూడా మార్కెట్లోకి వస్తోంది. పొరపాటున గమనించకుండా కొంటే నష్టపోవాల్సిందే. సరిగ్గా అల్లంలా కనిపించే అటువంటి మూలికను వ్యాపారులు ఇప్పుడు ఎక్కువ లాభం కోసం మార్కెట్‌లో విక్రయించడం ప్రారంభించారు. కొంతమంది దీనిని తహద్ అని కూడా పిలుస్తారు. అల్లం ఒక ఆయుర్వేద ఔషధం. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, అనేక వ్యాధులతో పోరాడే శక్తిని కూడా అందిస్తుంది. అల్లం ఉత్పత్తిలో ఎక్కువ భాగం భారతదేశంలోనే జరుగుతుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రపంచంలో దాదాపు 2700 టన్నుల అల్లం ఉత్పత్తి అవుతుండగా , అందులో 30 శాతం అంటే 900 టన్నులకు పైగా మన దేశంలోనే ఉత్పత్తి అవుతోంది. ఇదిలావుండగా నకిలీ అల్లంను మార్కెట్‌లో విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు కొందరు.
అల్లం కంటే కొండ చెట్టు వేరు చాలా చౌకగా ఉంటుందని, అందుకే మార్కెట్‌లో ఎక్కువ లాభం కోసం విక్రయిస్తున్నారని తెలుస్తోంది. మార్కెట్‌లో ఎక్కువ లాభం రావడంతో ఇప్పుడు కొంత మంది సాగు చేపట్టారు. విక్రయదారుడి నుంచి ఏజెంట్ వరకు పచ్చి బెల్లం అంటూ విక్రయిస్తున్నారు. మీరు మార్కెట్ నుండి అల్లం కొనుగోలు చేయబోతున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి. మరి నకిలీ అల్లాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉత్తమమైన, స్వదేశీ అల్లం ఉత్పత్తి అవుతుంది. స్థానిక, అత్యుత్తమ అల్లం లోపల మెష్ ఉంటుంది. అలాగే ఫైబర్స్ కూడా ఉంటాయి. ఆ అల్లం ఆరోగ్యానికి, ఆయుర్వేదానికి ఉత్తమమైనది. అల్లం కొనుగోలు చేసేటప్పుడు అల్లం లోపల మెష్, ఫైబర్ గురించి గుర్తుంచుకోండి. కొనే సమయంలో కొద్దిగా అల్లం తీయడం వల్ల మెష్, పీచు తెలుస్తాయి.
ఈ విషయాలను గుర్తుంచుకోండి:
మీరు మార్కెట్ నుండి అల్లం కొనడానికి వెళ్ళినప్పుడు అల్లంను మీరే క్షుణ్ణంగా తనిఖీ చేయండి. అల్లం కొనుగోలు చేసేటప్పుడు అల్లం పై పొర సన్నగా ఉండాలని గుర్తుంచుకోండి. మీ గోర్లతో అల్లంపై నొక్కినట్లయితే పైపొర కత్తిరించేలా పైకి రావాలి. ఇప్పుడు దాని వాసన ఉందా లేదా అని పరీక్షించండి. సువాసన ఘాటుగా ఉంటే, అల్లం నిజమైనది. లేకపోతే అది నకిలీ అల్లమని గుర్తించుకోవాలి. అల్లం అన్ని కాలాల పాటు ప్రతి ఒక్కరు వంటకాల్లో వాడుతుంటారన్న విషయం తెలిసిందే. వంటకాల్లోనే కాకుండా టీలో కూడా ఉపయోగిస్తుంటారు. అందువల్ల దాని డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి