Fact Check: వాట్సాప్‌ రాత్రి 11.30 నుంచి ఉదయం 6 గంటల వరకు నిలిచిపోనుందా..? ఇందులో నిజమెంత..?

|

Oct 13, 2021 | 8:19 AM

WhatsApp: ప్రస్తుతం ఏదైనా సమాచారం వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియానే. కానీ సోషల్‌ మీడియాలో మంచి కంటే చెడు ఎక్కువ ప్రచారం జరుగుతుంటుంది..

Fact Check: వాట్సాప్‌ రాత్రి 11.30 నుంచి ఉదయం 6 గంటల వరకు నిలిచిపోనుందా..? ఇందులో నిజమెంత..?
Follow us on

WhatsApp: ప్రస్తుతం ఏదైనా సమాచారం వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియానే. కానీ సోషల్‌ మీడియాలో మంచి కంటే చెడు ఎక్కువ ప్రచారం జరుగుతుంటుంది. అది నిజమా..? కాదా.. అనేది ఆలోచించకుండా చాలా మంది సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ను వైరల్‌ చేస్తుంటారు. పోస్టు పెట్టిన క్షణాల్లోనే అది లక్షలాది మందికి చేరిపోతుంటుంది. ఇటీవల కొన్ని సాంతికేక కారణాలతో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు కొన్ని గంటల పాటు నిలచిపోయిన విషయం తెలిసిందే. ఇక ఇలాంటి వాటిపై అనేక వదంతులు కూడా వచ్చాయి. ఇక ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో ఉండేది వాట్సాప్‌. దీనిని ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లోనే మునిగి తేలుతుంటారు. ఒక పూట తిండి అయిన మానేస్తారేమోగానీ.. వాట్సాప్‌ లేనిది ఉండని పరిస్థితి నెలకొంది.

ఇక వాట్సాప్‌ రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు కేంద్రం నిర్ణయించిందని, అలాగే దీనిని యాక్టివ్‌ చేసుకోవాలంటే నెలవారీగా కొంత మొత్తాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఖండించింది. ఇదంతా ఫేక్‌ న్యూస్‌ అంటూ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ)ఫ్యాక్ట్‌ చెక్‌ ట్విటర్‌ వేదికగా స్పష్టం చేసింది. అలాంటి ప్రకటనను కేంద్ర ప్రభుత్వం చేయలేదని, అంతా అబ్దమని, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి వార్తలను నమ్మవద్దని సూచించింది.

సోషల్‌ మీడియాలోని వార్తలు నమ్మవద్దు..

కాగా, ఇవే కాకుండా ఇలాంటివి ఎన్నో ఫేక్‌ వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్‌ అవుతున్నాయని, అలాంటివి ఎవ్వరు కూడా నమ్మవద్దని ఫ్యాక్ట్‌ చెక్‌ సంస్థ పీఐబీ సూచిస్తోంది. నిజం తెలుసుకోకుండా సోషల్‌ మీడియాలో ఏది పడితే అది పోస్టులు చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపింది. ఈ మధ్య కాలంలో ఫేక్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయని, వాటిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

 

ఇవీ కూడా చదవండి:

SBI Fixed Deposit: సీనియర్‌ సిటిజన్లకు ఎస్‌బీఐ ప్రత్యేక ఆఫర్‌.. ఈ పథకం ద్వారా ఎన్నో ప్రయోజనాలు..!

Gold Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తాజాగా 10 గ్రాముల ధర ఎంతంటే..!