Tech Tips: వర్షాకాలంలో ఫోన్‌ ఛార్జింగ్.. ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు.. జాగ్రత్త..

ఈ రోజుల్లో చాలా ఫోన్లు వాటర్ ప్రూఫ్ లేదా స్ప్లాష్ ప్రూఫ్ ఐపీ రేటింగ్‌తో వస్తున్నాయి, కాబట్టి మీ ఫోన్ తడిసినా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ బడ్జెట్ ఫోన్స్‌లో అలాంటివ ఫీచర్స్ ఉండవు. వర్షాకాలంలో ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు అసలు చేయకూడదు.

Tech Tips: వర్షాకాలంలో ఫోన్‌ ఛార్జింగ్.. ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు.. జాగ్రత్త..
Monsoon Phone Tips

Updated on: Aug 23, 2025 | 5:17 PM

వర్షాకాలం వచ్చిందంటే ఆరోగ్యాన్నే కాదు ఫోన్స్‌ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఫోన్‌ ఛార్జింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు వల్ల మీ ఫోన్‌కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వాతావరణం తేమగా ఉండటం వల్ల ఛార్జింగ్ పోర్ట్‌లో తేమ చేరితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదం ఫోన్ మదర్‌బోర్డు దెబ్బతినడానికి దారితీసి వేల రూపాయల నష్టానికి కారణమవుతుంది.

ఛార్జింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పోర్ట్ పొడిగా ఉండాలి:

ఫోన్‌ను ఛార్జ్ చేసే ముందు దాని ఛార్జింగ్ పోర్ట్ పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోవాలి. పోర్ట్‌లో తేమ ఉంటే, అది షార్ట్ సర్క్యూట్‌కు దారితీస్తుంది. ఇది కేవలం ఫోన్‌కే కాకుండా ఛార్జర్‌కు కూడా ప్రమాదకరం.

ఫోన్ తడిసిపోతే ఏం చేయాలి:

వర్షంలో మీ ఫోన్ తడిసిపోతే, దానిని పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే ఛార్జ్ చేయండి. చాలా ఖరీదైన ఫోన్‌లు వాటర్‌ప్రూఫ్ లేదా స్ప్లాష్‌ప్రూఫ్ రేటింగ్‌తో వస్తాయి. కానీ బడ్జెట్ ఫోన్‌లకు ఈ రేటింగ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అవి తడిసినప్పుడు సులభంగా దెబ్బతింటాయి.

ఛార్జర్, ఎలక్ట్రికల్ బోర్డ్:

ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ముందు ఛార్జర్ యొక్క యూఎస్‌బీ పోర్ట్‌ను కూడా చెక్ చేయండి. వర్షం కారణంగా అందులోకి కూడా తేమ చేరి ఛార్జర్‌ను దెబ్బతీస్తుంది. అలాగే మీరు ఫోన్‌ను ఛార్జ్ చేసే ఎలక్ట్రికల్ బోర్డును కూడా పరిశీలించాలి. వర్షాకాలంలో ఇవి దెబ్బతిని షార్ట్ సర్క్యూట్‌కు కారణం కావచ్చు.

భద్రతా ఫీచర్లు

కొన్ని ప్రీమియం ఫోన్‌లలో ఛార్జింగ్ పోర్ట్ తడిసినప్పుడు వినియోగదారులకు హెచ్చరికలు వస్తాయి. గూగుల్ పిక్సెల్, శామ్‌సంగ్ గెలాక్సీ S సిరీస్, ఐఫోన్ వంటి ఫోన్‌లలో పోర్ట్‌ను ఆరబెట్టాల్సిన అవసరం ఉందని నోటిఫికేషన్ వస్తుంది. ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పోర్ట్ తడిగా ఉన్నప్పుడు యూఎస్‌బీ పోర్ట్ దానంతలా అదే నిలిచిపోతుంది. ఫోన్ పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే అది మళ్లీ పనిచేయడం ప్రారంభిస్తుంది.

అదనపు సేఫ్టీ కోసం..

వర్షాకాలంలో మీ మొబైల్‌కు అదనపు రక్షణ కల్పించడానికి వాటర్‌ప్రూఫ్ కవర్ లేదా పౌచ్‌ను వాడటం మంచిది. ఇది ఒక ప్రత్యేక ప్లాస్టిక్ కవర్. దీనిలో ఫోన్‌ను ఉంచితే నీటి నుండి సురక్షితంగా ఉంటుంది. ఈ పౌచ్ పారదర్శకంగా ఉంటుంది కాబట్టి ఫోన్‌ను పై నుంచే ఉపయోగించవచ్చు. మీ ఫోన్ మోడల్‌కు సరిపోయే వివిధ రకాల వాటర్‌ప్రూఫ్ పౌచులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ చిన్నపాటి జాగ్రత్తలతో మీ విలువైన ఫోన్‌ను వర్షాకాలంలో కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.