Aadhar Update Service: ఆధార్ ఆధారం.. ఒక్క కార్డ్ అప్‌డేట్ చేసుకుంటే అన్నీ మారిపోతాయి… డిజీలాకర్ ద్వారానే అంతా..

మిగిలిన డాక్యుమెంట్స్ అప్ డేట్ చేయించుకోవడానికి ఇబ్బందిపడతాం. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధార్ ద్వారా కీలకమైన ప్రభుత్వ పత్రాలను స్వయంచాలకంగా నవీకరించే వ్యవస్థను పర్యవేక్షించే పనిలో ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Aadhar Update Service: ఆధార్ ఆధారం.. ఒక్క కార్డ్ అప్‌డేట్ చేసుకుంటే అన్నీ మారిపోతాయి... డిజీలాకర్ ద్వారానే అంతా..
Digi Locker

Updated on: Mar 08, 2023 | 2:00 PM

భారతీయులందరీకీ ఆధార్ కార్డు తప్పనిసరి గుర్తింపు కార్డుగా మారింది. సంక్షేమ పథకాల అమలు దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ వరకూ ప్రతి దానికి ఆధార్ అవసరమవుతుంది. ఉద్యోగ రీత్యా లేదా ఇతర అవరసరాల రీత్యా మనం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ఇతర పత్రాల అనేది ప్రహసనంగా మారింది. ఆధార్ సెంటర్‌కు వెళ్లడం, అప్లికేషన్ పూర్తి చేసి అప్ డేట్ చేస్తూ ఉంటాం. ఉన్న పనులన్నీ మానుకుని ఈ పని చేయించుకున్నా.. మిగిలిన డాక్యుమెంట్స్ అప్ డేట్ చేయించుకోవడానికి ఇబ్బందిపడతాం. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధార్ ద్వారా కీలకమైన ప్రభుత్వ పత్రాలను స్వయంచాలకంగా నవీకరించే వ్యవస్థను పర్యవేక్షించే పనిలో ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఫీచర్ అభివృద్ధి కాన్సెప్టులైజేషన్ ప్రాథమిక దశలో ఉందని, తుది వ్యవస్థను ప్రవేశపెట్టడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆధార్ కార్డుకు అప్‌డేట్ చేసినప్పుడల్లా ఆటో-అప్‌డేట్‌ ద్వారా కీలక పత్రాలపై అంటే డ్రైవింగ్ లైసెన్స్‌లు, రేషన్ కార్డ్‌లుచ ఓటర్ ఐడీ కార్డ్‌లు వంటివి ఆటోమెటిక్‌గా అప్ డేట్ అవుతాయి. 

ఆటో అప్ డేట్ పని చేసేదిలా..

డిజిలాకర్‌లో కీలకమైన ప్రభుత్వ పత్రాలను నిల్వ చేసే వినియోగదారులకు ఈ సిస్టమ్ ప్రాథమికంగా సహాయపడుతుంది. అనేక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు చేసే కేవైసీ ప్రక్రియల సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల, ఆధార్ కార్డ్‌లో చేసిన మార్పులు (ఇప్పటికి ఇంటి చిరునామా వంటి జనాభా మార్పులు) డిజిలాకర్‌లోని ఇతర పత్రాల్లో కూడా అప్ డేట్ అవుతాయి. డిజిలాకర్ అకౌంట్‌లో మనం ఆటో-అప్‌డేట్ సేవను ఎంచుకోవాలనుకుంటున్నామో? లేదో? ఎంచుకోవచ్చు.  ప్రస్తుతం రవాణా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వంటి పరిమిత మంత్రిత్వ శాఖలో ఈ అవకాశం అందుబాటులో ఉండనుంది. భవిష్యత్‌లో పాస్‌పోర్ట్‌లను ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేసే అవకాశం కల్పించవచ్చు. మంత్రిత్వ శాఖ ఆటో-అప్‌డేట్ ఫ్రేమ్ కోసం సాఫ్ట్‌వేర్ ఏపీఐలను అభివృద్ధి చేస్తుంది.

ప్రయోజనాలివే

డిజిలాకర్ పత్రాలను ఆధార్ ద్వారా అప్‌డేట్ చేయడానికి ఆటో-అప్‌డేట్ సిస్టమ్ చాలా ముఖ్యమైంది. ముఖ్యంగా డిపార్ట్‌మెంట్ల సమయం, ఖర్చులను ఆదా చేస్తుంది. అలాగే నకిలీ పత్రాల ముప్పును తొలగుతుంది. ఉద్యోగాల కారణంగా తరచుగా తరలివెళ్లే పౌరులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..