వాట్సాప్ సేవలు నిలిచిపోయాయన్న వార్త క్షణంలో ప్రపంచాన్ని చుట్టేసింది. కేవలం 110 నిమిషాలపాటు సేవలు నిలిచిపోతేనే నెటిజన్లు గగ్గోలు పెట్టారు. వాట్సాప్‌కు ఏమైంది అంటూ గూగుల్‌లో తెగ వెతికేశారు. సర్వర్ డౌన్, హ్యాకింగ్ ఇలా రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే టెక్నీకల్ ప్రాబ్లమ్ కారణంగానే వాట్సాప్ సేవలు ఆగిపోయాయని సమాచారం. ఈ నేపథ్యంలో వాట్సాప్ సేవలను త్వరగతిన పునరుద్ధరించింది మెటా సంస్థ. అయితే ఒక యాప్ రెండు గంటలు పనిచేయకపోతే ఇంత చర్చ జరగాల్సిన అవసరం ఏముంది.? ఆ యాప్‌లో ఉన్న ప్రత్యేకతలేంటి.? లాంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ యాప్‌ను అన్ని దేశాల్లో సుమారు 244 కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు. ఇది దాదాపు రెండు అతిపెద్ద దేశాల జనాభాతో సమానం. వాట్సాప్‌లో ఉన్న ఫీచర్లు, యూజర్ ఫ్రెండ్లీగా ఉండే యాక్సెస్ కారణంగా కోట్లాది మంది దీనికి అట్రాక్ట్ అయ్యారు. వాట్సాప్‌కు ఈ క్రేజ్ కారణంగానే ఫేస్‌బుక్ ఈ మెసేజింగ్ సంస్థను ఏకంగా 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం కరెన్సీ విలువ ఆధారంగా ఇది సుమారు రూ. 15 లక్షల కోట్లకు సమాధానం.
భారత్‌లో వాట్సాప్‌ను సుమారు 48 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. ప్రతి రోజూ వాట్సాప్‌లో సుమారు పది వేల కోట్ల మెసేజ్‌లు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. వీడియో, ఆడియా కాల్స్‌తో పాటు చివరికి డబ్బులు పంపించుకునేందుకు వీలుగా యూపీఐ సేలను సైతం తీసుకొచ్చింది. ప్రపంచంలో ఏ మూలన ఉన్న వారితోనైనా ఉచితంగా ఆడియ, వీడియో కాల్స్ మాట్లాడుకునే అవకాశం కల్పించింది. యూజర్ల అవసరాలకు, భద్రతకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది వాట్సాప్. ఇందులో భాగంగా డిలీట్ వర్ ఎవ్రీ వన్ సమయం పెండం, ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ వంటి ఫీచర్లను తీసుకొచ్చింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..