Mars Photo: భూమిపై కాకుండా జీవం మరెక్కడైనా ఉంటుందా.. అన్న ప్రశన్నకు ఠక్కున వచ్చే సమాధానం మార్స్. మనిషి మనుగడకు అంగారక గ్రహం అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్నేళ్లుగా మార్స్‌పై మానవుని పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ ఈ దిశలో మరో అడుగు ముందుకు వేసింది. మార్స్ గుట్టు రట్టు చేసేందుకు గాను.. పర్సెవర్సెనస్ రోవర్‌ను మార్స్ పైకి పంపించిన విషయం తెలిసిందే. ఈ విజయాన్ని పురస్కరించుకొని నాసా తాజాగా ప్రజలకు అంగారకుడిపై ఫొటో తీసుకునే అవకాశం కల్పించింది. అంటే మనుషులను మార్స్‌పైకి తీసుకెళ్తారని అనుకోకండి.
అచ్చంగా మార్స్‌పై ఫొటో దిగినట్లు భావన కలిగేలా.. మార్స్ వర్సెవరెన్స్ ఫొటో బూత్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం నాసా అంగారకుడికి సంబంధించిన ఎనిమిది బ్యాక్‌గ్రౌండ్ ఫొటోలతో కొన్ని డమ్మీ ఇమేజ్‌లను డిజైన్ చేసింది. అందులో మనకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ను ఎంచుకుని మన ఫొటోను అప్‌లోడ్ చేస్తే చాలు.. మార్స్‌లో ఉన్నట్లు, పర్సెవరెన్స్ రోవర్ పక్కనే నిల్చొని సెల్ఫీ దిగినట్లు, మార్స్ మిషన్ గదిలో ఉన్నట్లుగా ఫొటోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం మీరు కూడా మార్స్‌పై దిగినట్లు ఉన్న ఫొటోను డౌన్‌లోడ్ చేసుకొని స్టేటస్‌లో పెట్టుకోండి. ఫొటోను క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.