i-SIM vs e-SIM: సిమ్ కార్డులేని ఫోన్లు వచ్చేస్తున్నాయి.. భవిష్యత్తు అంతా వీటిదే.. పూర్తి వివరాలు..

స్మార్ట్ ఫోన్లలో వాడే సిమ్ కార్డులు అందరికీ తెలిసిందే. అయితే అమెరికా లాంటి దేశాల్లో ఈ-సిమ్ లు వినియోగంలో ఉన్నాయి. మన దేశంలో అవి ఇంకా పూర్తి స్థాయిలో వాడకంలోకి రాలేదు. అయినప్పటికీ కొన్ని ఫోన్లలో ఈ-సిమ్ సపోర్టు చేస్తుంది. కొంతమంది వినియోగిస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు ఈ ఈ-సిమ్ స్థానాన్ని ఐ-సిమ్ భర్తీ చేసేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఐ-సిమ్ అందుబాటులోకి రానున్నట్లు టెక్ సర్కిళ్లలో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ-సిమ్ అంటేనే సరిగ్గా తేలీదు.. ఈ ఐ-సిమ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.

i-SIM vs e-SIM: సిమ్ కార్డులేని ఫోన్లు వచ్చేస్తున్నాయి.. భవిష్యత్తు అంతా వీటిదే.. పూర్తి వివరాలు..
eSIM
Follow us
Madhu

|

Updated on: Oct 20, 2023 | 4:45 PM

ప్రపంచ పరుగెడుతోంది. అత్యాధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటూ వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. మానవుడికి సకల సౌకర్యాలను తీసుకొస్తోంది. అన్ని రంగాల్లో శాస్త్ర సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ రోజు ఉన్న మెథడ్స్ రేపు ఉండటం లేదు. ఎప్పటికప్పుడు అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో కూడిన సాఫ్ట్ వేర్లు అరంగేట్రం చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలో వాడే సిమ్ కార్డులు అందరికీ తెలిసిందే. అయితే అమెరికా లాంటి దేశాల్లో ఈ-సిమ్ లు వినియోగంలో ఉన్నాయి. మన దేశంలో అవి ఇంకా పూర్తి స్థాయిలో వాడకంలోకి రాలేదు. అయినప్పటికీ కొన్ని ఫోన్లలో ఈ-సిమ్ సపోర్టు చేస్తుంది. కొంతమంది వినియోగిస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు ఈ ఈ-సిమ్ స్థానాన్ని ఐ-సిమ్ భర్తీ చేసేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఐ-సిమ్ అందుబాటులోకి రానున్నట్లు టెక్ సర్కిళ్లలో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ-సిమ్ అంటేనే సరిగ్గా తేలీదు.. ఈ ఐ-సిమ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి. దీనిలో ఈ-సిమ్ అంటే ఏమిటి? దాని వినియోగం, ప్రయోజనాలు, అలాగే ఐ-సిమ్ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు, రెండింట్లో ఏది బెస్ట్? అనే అంశాలను కూలంకషంగా తెలుసుకుందాం..

క్వాల్కామ్ ప్రకటన ఇది..

ఈసిమ్ కంటే ఐసిమ్ అడ్వాన్స్ డ్ వెర్షన్ అని చెప్పాలి. దాని కంటే ఐసిమ్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. భవిష్యత్తులో వచ్చే స్నాప్‌డ్రాగన్ చిప్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లకు ఈ ఐసిమ్ లను తీసుకొస్తున్నట్లు క్వాల్కామ్ సంస్థ ఇటీవల ప్రకటించింది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్ ఈ ఐసిమ్ కు ససోర్టు చేస్తుంది. భవిష్యత్తులో మిలియన్ల కొద్దీ వినియోగదారులు ఈ ఐసిమ్ లనే వినియోగిస్తారని క్వాల్కామ్ కచ్చితంగా చెబుతోంది.

ఈ-సిమ్ గురించి తెలుసుకుందాం..

ఈ-సిమ్లు నేరుగా ఫోన్ హార్డ్‌వేర్‌లోనే ఇన్ బిల్ట్ వస్తాయి. ప్రత్యేక చిప్‌లో సిమ్ ను ఇన్ స్టాల్ చేస్తారు. ఇది భౌతిక సిమ్ కార్డ్‌ల కంటే చిన్నదిగా ఉంటుంది. దీంతో ప్రత్యేకంగా సిమ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. దీంతో ఆ స్లిమ్ స్లాట్ కూడా ఫోన్లో ఉండదు. ఆ స్థలం కూడా ఫోన్ లో కలిసివస్తుంది. మీకు ఈ-సిమ్ కావాలంటే మీరు ఏ నెట్ వర్క్ అయితే వినియోగస్తున్నారో ఆ ఆపరేటర్ ఆఫ్ లైన్ స్టోర్ కి వెళ్లాలి. లేదా యాప్ లో కూడా రిక్వెస్ట్ పెట్టొచ్చు. ఈ-సిమ్ ని యాక్టివేట్ లేదా ఎనేబుల్ చేసే ప్రక్రియ చాలా సులభం కానీ అన్ని ఆపరేటర్లకు ఒకే విధమైన ప్రక్రియ ఉండదు. ప్రాసెస్ మారుతుంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఫోన్లలో మాత్రమే.. ఈ-సిమ్ అన్ని ఫోన్లకు పని చేయదు. ప్రస్తుతం మన దేశంలో కొన్ని ప్రీమియం ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. యాపిల్ కంపెనీ నుంచి ఐఓఎస్ వెర్షన్ 12.1 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్లకు మాత్రమే ఈ-సిమ్ సపోర్టు ఉంటుంది. ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఐఫోన్ 11 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ సిరీస్, ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 14 , ఐఫోన్ 15 మోడళ్లలో ఈ-సిమ్ పనిచేస్తుంది. అదే విధంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో చాలా తక్కువ కంపెనీలకు చెందిన ఫోన్లకు మాత్రమే ఈ-సిమ్ సపోర్టు ఉంది. అవేంటంటే శామ్సంగ్, గూగుల్, మోటోరోలా, నోకియా, వివో ఫోన్లు అవి కూడా లేటెస్ట్ సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ అయ్యి ఉన్న ఫోన్లకు మద్దతిస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్, గెలాక్సీ ఫోల్డ్, గెలాక్సీ నోట్ 20 అల్ట్రా, గెలాక్సీ నోట్ 20, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2, గెలాక్సీ ఎస్21 సిరీస్, గెలాక్సీ ఎస్20 సిరీస్, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3, గెలాక్సీ ఎస్ 22 సిరీస్, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఫోన్లలో ఈ-సిమ్ సపోర్టు చేస్తుంది. ఇతర కంపెనీ విషయానికి వస్తే మోటోరోలా రాజ్ఆర్, మోటోరోలా నెక్ట్స్ జెన్ రాజ్ఆర్, మోటోరోలా ఎడ్జ్ 40, మోటోరోలా రాజ్ఆర్ 40 సిరీస్, నోకియా జీ60, నోకియా ఎక్స్30, వివో ఎక్స్90 ప్రో, గూగుల్ పిక్సల్ 3 ఫోన్లలో ఈ-సిమ్ సపోర్టు ఉంటుంది.

ఈ-సిమ్ ప్రయోజనాలు.. ఈ-సిమ్లు భౌతిక సిమ్ కార్డ్‌లు, వాటి స్లాట్ అవసరాన్ని తొలగిస్తాయి. ఫలితంగా మరింత కాంపాక్ట్ డివైజ్ డిజైన్‌లు చూడొచ్చు. ఇది సొగసైన, సన్నగా ఉండే పరికరాలు మనకు చేతిలో ఉంటాయి. ఎక్కువగా సిమ్ కార్డులు మార్చుకొనే వ్యక్తులకు ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఫిజికల్ సిమ్ ఉండదు కాబట్టి అంతా యాప్ లేదా ఆన్ లైన్ పోర్టల్లోనే జరిగిపోతుంది. ఇది సులభంగా, వేగంగా పూర్తయిపోతుంది. ఇవి మెరుగైన భద్రతా ఫీచర్లను అందిస్తాయి. అనధికారిక యాక్సెస్ లేదా ట్యాంపరింగ్ చేయడం చాలా కష్టం. తద్వార మీ సున్నితమైన డేటాను రక్షించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ-సిమ్ ప్రతికూలతలు.. మీరు తరచుగా హ్యాండ్ సెట్లను మార్చినప్పుడు ఈ-సిమ్ ఇబ్బంది కలిగిస్తుంది. ఫిజికల్ సిమ్ కార్డును కొత్త ఫోన్‌కి సులభంగా బదిలీ చేయచ్చు. ఈ-సిమ్ యాక్టివేషన్ ప్రక్రియ మీరు పరికరాలను మార్చిన ప్రతిసారీ సెటప్ విధానాన్ని పునరావృతం చేయాల్సి ఉంటుంది.

ఐ-సిమ్ అంటే ఏమిటి?

ఈ-సిమ్ మాదిరిగానే ఐసిమ్ కూడా ఉంటుంది. కానీ ఇది చిప్‌సెట్‌లో కలిసిపోయి ఉంటుంది. ఆపరేట్ చేయడానికి అదనపు చిప్ అవసరం లేదు. నానో సిమ్ కార్డ్ కంటే ఐసిమ్ వంద రెట్లు చిన్నదిగా ఉంటుందని క్వాల్కామ్ ప్రకటించింది. ప్రస్తుతం ఇది స్నాప్ డ్రాగన్ 8జెన్ 2 ఎస్ఓసీలో మాత్రమే అందుబాటులో ఉంది.

ఐ-సిమ్ ప్రయోజనాలు..

  • స్నాప్‌డ్రాగన్-ఆధారిత ఫోన్‌ల కోసం ప్రముఖ చిప్ తయారీదారు క్వాల్కామ్ ఐసిమ్ సాంకేతికను డెవలప్ చేసింది. ఇది ఈ-సిమ్ కన్నా అత్యాధునిక సాంకేతికతో వస్తుంది. మెరుగైన బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది.
  • -దీని ప్రాథమిక ప్రయోజనం ఏమిటంటే, ఇది సిమ్ కార్డ్ స్లాట్ అవసరాన్ని తొలగిస్తుంది, మెరుగైన స్పీకర్ లేదా అదనపు వైబ్రేషన్ మోటారు వంటి వాటి ద్వారా స్థలాన్ని ఉపయోగించడానికి అనుమతిస్తుంది.
  • ఇది ఫోన్‌ను దుమ్ము మరియు నీటికి మరింత నిరోధకతను కలిగిస్తుంది. ఇతర ప్రయోజనాలు ఈ-సిమ్ మాదిరిగానే ఉంటాయి.

ఐ-సిమ్ సపోర్టు చేసే ఫోన్లు.. ప్రస్తుతానికి, దీనికి సపోర్ట్ చేసే ఫోన్ ఏదీ లేదు. కానీ, స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఈ ఫీచర్‌ను అన్వేషిస్తున్నాయని, త్వరలోనే ఈ ఐసిమ్ కలిగి ఫోన్లు వచ్చే అవకాశం ఉందని క్వాల్కామ్ చెబుతోంది. భవిష్యత్తులో శామ్సంగ్ గెలాక్సీ ఫోన్లతో పాటు 300 మిలియన్ల ఐసిమ్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. 2030 నాటికి ఈ లక్ష్యం చేరుకుంటామని క్వాల్కామ్ పేర్కొంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది కిక్కోకిక్కు.. ఒక్క రాత్రిలో రూ.402కోట్ల మద్యం హాంఫట్
కొత్త ఏడాది కిక్కోకిక్కు.. ఒక్క రాత్రిలో రూ.402కోట్ల మద్యం హాంఫట్
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ పై స్పెషల్ అప్డేట్..
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ పై స్పెషల్ అప్డేట్..
హిట్‌మ్యాన్‌తో ఆ నలుగురు.. ఇక క్రికెట్‌కు గుడ్‌బై.!
హిట్‌మ్యాన్‌తో ఆ నలుగురు.. ఇక క్రికెట్‌కు గుడ్‌బై.!
కామాంధుడికి తగిన శిక్ష విధించిన కోర్టు..!
కామాంధుడికి తగిన శిక్ష విధించిన కోర్టు..!
క్రాకర్ కాల్చి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పాలనుకున్నాడు.. చివరకు..
క్రాకర్ కాల్చి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పాలనుకున్నాడు.. చివరకు..
ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు
ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు
మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..