Dizo Smart Watch: మార్కెట్‌లోకి రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు.. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్స్.. ధర ఎంతో తెలుసా?

డిజో కంపెనీ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీకు టెక్‌లైఫ్‌ బ్రాండ్. ఈ బ్రాండ్‌లో ప్రస్తుతం డీ2, డీ2 పవర్ అనే రెండు వాచ్‌లు రిలీజ్ చేశారు. అంతేకాక శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ వాచ్‌లు ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

Dizo Smart Watch: మార్కెట్‌లోకి రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు.. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్స్.. ధర ఎంతో తెలుసా?
Dizo Watch
Follow us
Srinu

|

Updated on: Feb 10, 2023 | 3:00 PM

స్మార్ట్‌వాచ్ కేటగరీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న డిజో కంపెనీ ఇప్పుడు మరో రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. డిజో కంపెనీ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీకు టెక్‌లైఫ్‌ బ్రాండ్. ఈ బ్రాండ్‌లో ప్రస్తుతం డీ2, డీ2 పవర్ అనే రెండు వాచ్‌లు రిలీజ్ చేశారు. అంతేకాక శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ వాచ్‌లు ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే ఈ స్మార్ట్‌వాచ్‌లో అధునాతన ఫీచర్లు చాలా ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వాచ్ 150 నిట్స్‌తో ప్రకాశవంతమైన డిస్‌ప్లేతో వస్తుందని పేర్కొంటున్నారు. 150కు పైగా వాచ్ ఫేస్‌లు, 120కు పైగా స్పోర్ట్స్ మోడ్‌లతో ఈ వాచ్ లు వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే డిజో డీ2 పవర్ స్మార్ట్‌వాచ్‌లో మాత్రం కేవలం 24 స్పోర్ట్స్ మోడ్‌లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ.5999 కాగా అన్ని తగ్గింపులతో రూ.1799 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంది.

డిజో డి2 ప్రత్యేకతలు ఇవే

ఈ వాచ్‌లు 1.9 అంగుళాల డిస్‌ప్లేతో ఆకర్షనీయమైన బెల్ట్‌తో వస్తుంది. ముఖ్యంగా డి2, డి2 పవర్ వాచ్‌లు ఆరోగ్యరక్షణకు ప్రాధాన్యతను ఇస్తుంది. ఆరోగ్య ట్రాకింగ్‌తో పాటు, కెమెరా, ఫోన్‌లోని మ్యూజిక్ వంటి వాటిని నియంత్రించే అవకాశం ఉంటుంది. డిజో ఫిట్ యాప్ సపోర్ట్‌తో పాటు జీపీఎస్ రన్నింగ్ రూట్ ట్రాకింగ్, వాచ్ ఫేస్ గ్యాలరీ, డైలీ, వీక్లీ, మంత్లీ ట్రాకింగ్ రిపోర్ట్స్ వంటి అధునాతన ఫీచర్లు ఈ వాచ్ ద్వారా వస్తాయి. అలాగే ఈ వాచ్‌లు ఒషియన్ బ్లూ, క్లాసిక్ బ్లాక్, సిల్వర్ గ్రే రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. 

ఇవి కూడా చదవండి

డి2, డి2 పవర్ స్పెసిఫికేషన్లు ఇవే

  • హైబ్రిడ్ అల్యుమీనియం ఫ్రేమ్, 1.91 అంగుళాల డిస్‌ప్లే
  • వాటర్ రెసిస్టెంట్‌తో పాటు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్
  • 150+ స్టైలిష్ వాచ్ ఫేసెస్
  • 120+ స్పోర్ట్స్ మోడ్‌లు
  • 7 డేస్ బ్యాటరీ బ్యాకప్, డీ2 పవర్‌లో 10 రోజుల బ్యాటరీ బ్యాకప్
  • డి2 వాచ్ కోసం డిజో ఫిట్‌యాప్ సపోర్ట్, డీ2 పవర్ కోసం డిజో యాక్టివ్ యాప్ సపోర్ట్
  • రియల్ మీ టెక్ లైఫ్ క్వాలిటీ ఎస్యూరెన్స్

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..